
యముడు అంటే ఇలానే ఉండాలి అనే మాటకి పది సార్లు యముండా అని ఆనాలని రొటీన్ నుంచి బంబోల జంబ న్ని కొత్త ఊతపదం మోహన్ బాబు చేత అనిపించాడు రాజమౌళి .. అయితే ఈ సినిమాలో మోహన్ బాబు యముడుగా ఎంతో అద్భుతంగా చేశాడు .. ముందుగా ఈ పాత్ర ఆయన చేయాల్సింది కాదట .. యముడిగా రాజమౌళి ముందు వేరే నటుడిని అనుకున్నారని తెలుస్తుంది .. అతను మరెవరో కాదు దివంగత సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ .. ఆయనతో ఈ సినిమాలో ఆ పాత్ర చేయించాలని ముందుగా రాజమౌళి అనుకున్నారు .. యముడుగా కైకాల కనిపిస్తే ప్రేక్షకుల ఉత్సవం మరింత పెరుగుతుందని ఆయన ఆ భావించారు .
అంతేకాకుండా ఆ క్యారెక్టర్ చేయాలని కైకాల సత్యనారాయణ కూడా అడిగాడట .. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల కైకాల ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చినట్టు తెలుస్తుంది . అది కూడా రెమ్యూనిరేషన్ కారణంగా ఈ సినిమాను ఆయన మిస్ అయ్యారట .. ఇదే విషయం కైకాల గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టు తెలుస్తుంది .. ఇక తర్వాత మోహన్ బాబును ఈ సినిమాలకి తీసుకోవడం ఆ క్యారెక్టర్ అనుకున్న దానికంటే అద్భుతంగా రావటంతో రాజమౌళికి ఉన్న చిన్న అనుమానం కూడా తీరిపోయింది . ఇక ఈ సినిమా సక్సెస్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు . 2007 ఆగస్టు 15న యమదొంగ ప్రేక్షకులు ముందుకు వచ్చి అప్పట్లోనే భారీ కలెక్షన్లు అందుకుంది . 18 బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తే 30 కోట్లకు పైగా లాభాలు తెచ్చుకుంది యమదొంగ .