మెగా స్టార్ చిరంజీవితో డాన్స్ చేయడమంటే హీరోయిన్లకు పెద్ద సవాల్ .. చిరు వేసే డాన్స్ వేగాన్ని మ్యాచ్ చేయలేక ఇబ్బంది పడ్డామంటూ  గతంలో చాలామంది హీరోయిన్లు చెప్పారు .. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం చిరంజీవి పక్కన డాన్స్ చేస్తుంటే అభిమానులకు ఎంతో చూడా ముచ్చటగా ఉంటుంది .  రాధా , విజయశాంతి, శ్రీదేవి లాంటి హీరోయిన్స్ చిరంజీవికి జంటగా బలే ఉంటారు .. గతంలో చిరంజీవితో కలిసి నటించిన కొంతమంది హీరోయిన్లు ఇప్పుడు స్టార్ హీరోల భార్యలు అనే విషయం చాలామందికి తెలియదు. ఇంత‌కు ఆ హీరోయిన్లు ఎవరు అనేది ఇక్కడ తెలుసుకుందాం.
 

రాధిక చిరంజీవి లది అప్పట్లో తిరుగలేని జంట .. అభిలాష, ఆరాధన, న్యాయం కావాలి, దొంగ మొగుడు  ఇలా ఎన్నో చిత్రాల్లో చిరంజీవి , రాధిక కాంబోలో వచ్చాయి .. అప్పట్లో వీరి జంట వెండితెరపై ఎంతో చూడచక్కగా ఉండేది .. అయితే 2001లో రాధా హీరో శరత్ కుమార్ ని పెళ్లి చేసుకున్నారు .. ఇక శరత్ కుమార్ హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే .. ఇది రాధిక కు మూడో పెళ్లి . మరో కన్నడ దిగ్గిజ న‌టుడు అంబరీష్ భార్య సుమలత కూడా చిరంజీవితో గతంలో కొన్ని సినిమాల్లో నటించారు .. చిరంజీవి ఫ్యామిలీ సుమలత ఫ్యామిలీ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది .. ఖైదీ , చట్టంతో పోరాటం, శుభలేఖ లాంటి సినిమాలో చిరంజీవి , సుమలత కలిసి నటించారు .. ఇక 1990 లో చిరంజీవి నటించిన రాజా విక్రమార్క సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది ఈ సినిమాలో చిరంజీవికి జంటగా అమల హీరోయిన్గా న‌టించిడం మరో స్పెషల్ .. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన రెండు సంవత్సరాలకి నాగార్జున , అమల పెళ్లి చేసుకున్నారు .


ఇక మరో హీరోయిన్ నిరోషా కూడా చిరంజీవితో కలిసి నటించారు .. వీరిద్దరూ కలిసి నటించిన సినిమా స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ .. 90వ దశంలో ఫీల్ గుడ్ మూవీస్ తో అలరించిన హీరో రాంకీని , నిరీష  1995లో  పెళ్లి చేసుకుంది .. హీరోయిన్ రాధిక , నిరోషా  సొంత అక్క చెల్లెలు అవుతారు . అలాగే చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఠాగూర్ కూడా ఒకటి .. ఈ సినిమాలో చిరుకు జంటగా జ్యోతిగా నటించారు .. ఈమె  సౌత్ అగ్ర హీరో సూర్య భార్య అనే విషయం అందరికీ తెలిసిందే ..  అయితే జ్యోతిగా ఒక అప్పటి స్టార్ హీరోయిన్ నగ్మాకి చెల్లి అవుతారు .. ఇక చిరంజీవి నగ్మా కలిసి ఘరానా మొగుడు లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలు నటించారు .  అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత చివరగా నటించిన తెలుగు మూవీ అంజి .  ఈ సినిమాలో చిరు , నమ్రత కలిసి నటించారు ..  ఇలా గతంలో చిరంజీవి తో కలిసి నటించిన  హీరోయిన్లు ఇప్పుడు అగ్ర హీరోలను పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయ్యారు .

మరింత సమాచారం తెలుసుకోండి: