
మృణాల్ ఠాకూర్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు . ఈ పేరు అందరికీ తెలిసిందే. సీతారామం సినిమాలో తనదైన స్టైల్ లో నటించి మెప్పించింది. అయితే మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమా తర్వాత చాలా చాలా పెద్ద పెద్ద సినిమాలలో ఆఫర్లు వచ్చాయి , కానీ ఆమె పాత్ర మాత్రం కేవలం గ్లామర్ టచ్ లోనే ఉంటుంది అను బడా స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చినా సరే తన పాత్రకు న్యాయం లేదు అని తన పాత్రకు ప్రాధాన్యత లేదు అని ఆమె ఆఫర్ రిజెక్ట్ చేసింది .
కేవలం ఒక సినిమా మాత్రమే కాదు ..ఆరు - ఏడు రెండు సినిమాలు సైతం ఆమె రిజెక్ట్ చేసింది. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎంత పెద్ద హీరో సినిమా అయినా చేయను అంటూ తెగేసి చెప్పేసింది . అంతేకాదు తన తల్లిదండ్రులకు బోల్డ్ గా నటించడం ఇష్టం లేదు అని ఆ కారణంగానే సినిమాలో బోల్డ్ సీన్స్ చేయకూడదు అని డిసైడ్ అయ్యాను అని స్వయంగా మృణాల్ నే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది . దీంతో అందరం మృణాల్ ఠాకూర్ కి బిగ్ ఫ్యాన్స్ అయిపోయారు . హీరోయిన్స్ అందరు మృణాల్ ఠాకూర్ లానే కచ్చితంగా అన్ని విషయాలలో ఉంటే సినిమా ఇండస్ట్రీలో వల్గారిటీ .. క్యాస్టింగ్ కౌచ్ అనేటివి ఉండవని.. సినిమా ఇండస్ట్రీ ఎప్పుడో బాగుపడిపోయి ఉండేది అని మాట్లాడుకుంటున్నారు . మొత్తానికి మృణాల్ ఠాకూర్ తన డెసిషన్ తో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించేసుకునేసింది..!!