టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న వయస్సులోనే హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన వారిలో నితిన్ ఒకరు. నితిన్ కెరీర్ పరంగా విజయాలు ఎక్కువగానే ఉన్నా వరుస విజయాలు సాధించకపోవడం నితిన్ కు మైనస్ అయింది. భీష్మ తర్వాత సరైన హిట్ లేని నితిన్ రాబిన్ హుడ్ సినిమాతో హిట్ అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు. నితిన్ మార్కెట్ తో సంబంధం లేకుండా ఈ సినిమాకు ఏకంగా 70 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
 
గతేడాది డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. నితిన్ గత ఐదేళ్లుగా భారీ హిట్ అందుకోవాలని కలలు కంటున్నారు. ఆ కలను రాబిన్ హుడ్ సినిమా నెరవేరుస్తుందేమో చూడాల్సి ఉంది. దేవిడ్ వార్నర్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించడం ఈ సినిమాకు ఒక విధంగా ప్లస్ అయిందనే సంగతి తెలిసిందే.
 
దేవిడ్ వార్నర్ అభిమానులు సైతం ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. రాబిన్ హుడ్ సినిమాకు ఒకింత భారీ స్థాయిలోనే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం అందుతోంది. రాబిన్ హుడ్ సినిమా సక్సెస్ సాధించడం అటు నితిన్ తో పాటు ఇటు శ్రీలీలకు కూడా కీలకమనే సంగతి తెలిసిందే. ఛలో, భీష్మ సినిమాలతో వెంకీ కుడుముల బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేశారు.
 
గత కొన్నేళ్లలో నితిన్ ఫ్యాన్స్ ను అంతో ఇంతో మెప్పించిన సినిమా రంగ్ దే మాత్రమే కాగా నితిన్ తర్వాత సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో మ్యాజిక్ చేస్తారో చూడాల్సి ఉంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలన్నీ హిట్టయ్యాయి. బాక్సాఫీస్ వద్ద కూడా నితిన్ ఈ సినిమాతో సత్తా చాటడం పక్కా అని అభిమానులు ఫీలవుతున్నారు. సినిమా సినిమాకు నితిన్ రేంజ్ పెరుగుతోంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: