
ప్రస్తుతం ఈ సినిమాపై మంచు ఫ్యామిలీ భారీ అంచనాలనే పెట్టుకుంది. త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మంచు ఫ్యామిలీ చాలా బిజీగా గడుపుతోంది.ఇదే తరుణంలో మంచు విష్ణు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ తన పిల్లల గురించి ఒక విషయాన్ని బయట పెట్టారు. అవి ఏమిటో ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ..ప్రస్తుత కాలంలో చాలామంది ఒకరు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే కంటున్నారు.. కానీ మంచు విష్ణు మాత్రం ఇప్పటికే నలుగురు పిల్లల్ని కన్నారు. ఇంకా పిల్లలు కావాలని అంటున్నారుట ..అయితే అదే విషయాన్ని తన భార్యకు చెపితే దీంతో ఆమె భయపడి ఇంకా పిల్లలు నా వల్ల కాదు బాబోయ్ ..నీకు ఇంకా పిల్లలు అవసరమైతే వేరే అమ్మాయిని చేసుకోండి.
అంటూ సమాధానం ఇచ్చిందట ప్రస్తుతం మంచు విష్ణు చెప్పిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది .పెద్ద పెద్ద ఫ్యామిలీలకు సినీ ఇండస్ట్రీ స్టార్ హీరోల ఫ్యామిలీ లకు కుటుంబ నియంత్రణ అనేది ఉండదా.. అంటూ జనాలు కామెంట్లు చేస్తున్నారు .ప్రస్తుతం మంచు విష్ణు హీరో గా వస్తున్న కన్నప్ప చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న నట్లు తెలుస్తోంది. ఇందులో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, శరత్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు వంటి వారు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు ..