
లూసిఫర్ సినిమాకు కొనసాగింపుగా ఎల్2 ఎంపురాన్ మార్చి నెల 27వ తేదీన రిలీజ్ కానుంది. ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం అందుతోంది. లూసిఫర్ సినిమా తెలుగులో గాడ్ ఫాదర్ టైటిల్ తో రీమేక్ అయింది. విక్రమ్ హీరోగా తెరకెక్కిన వీర ధీర శూర సినిమా కూడా ఈ వారం థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి.
రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. సల్మాన్ మురుగదాస్ కాంబోలో తెరకెక్కిన సికిందర్ మార్చి నెల 30వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఓటీటీల విషయానికి వస్తే జీ5లో విడుదల పార్ట్2 హిందీ వెర్షన్ ఈ నెల 28వ తేదీన స్ట్రీమింగ్ కానుంది. ఆహా ఓటీటీలో ది ఎక్స్ టార్డినరీ జర్నీ ఆఫ్ ఫకీర్ తెలుగు వెర్షన్ ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ కానుండటం గమనార్హం.
జియో హాట్ స్టార్ లో ఈ నెల 26వ తేదీ నుంచి ముఫాసా ద లయన్ కింగ్ తెలుగు హిందీ వెర్షన్లు స్ట్రీమింగ్ కానున్నాయి. అమెజాన్ ప్రైమ్ లో హాలెండ్ ఇంగ్లీష్ వెర్షన్ ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఈ నెల 26 నుంచి మిలియన్ డాలర్ సీక్రెట్ రియాలిటీ షో స్ట్రీమింగ్ కానుందని భోగట్టా. థియేటర్లలో, ఓటీటీలలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తాయో చూడాలి.