
టీజర్ లో కామెడీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. అలీ, అనిత హంసానందిని ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారని సమాచారం అందుతోంది. మన కథ బొమ్మరిల్లు కాదు రక్తచరిత్ర అంటూ హీరోయిన్ చెప్పిన డైలాగ్ టీజర్ కు హైలెట్ గా నిలిచింది. సుహాస్ ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కచ్చితంగా అందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
సుహాస్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 3 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని తెలిసింది. షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ను మొదలుపెట్టిన సుహాస్ ప్రస్తుతం ఒకింత భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు. సుహాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
సుహాస్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతున్నాయి. సుహాస్ తర్వాత సినిమాలతో ఏ స్థాయిలో బాక్సాఫీస్ ను షేక్ చేస్తారో చూడాల్సి ఉంది. సుహాస్ ను అభిమానించే ఫ్యాన్స్ ఒకింత భారీ స్థాయిలో ఉన్నారు. సుహార్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం సుహాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది. హీరో సుహాస్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.