బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విక్కీ కౌశల్ ,రష్మిక కాంబినేషన్ లో వచ్చిన తాజా చిత్రం ఛావా. ఈ సినిమా చత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. డైరెక్టర్ లక్ష్మణ్ హుటేకర్ ఈ సినిమాని తెరకెక్కించారు. గత ఏడాది విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడి ఈ ఏడాది ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఛావా సినిమా మొదటి షో నుంచి మంచి హిట్  టాకుతో దూసుకుపోయింది.


ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వడంతో అన్ని భాషలలో కూడా విడుదల చేయాలని డిమాండ్ ఏర్పడింది. మార్చి ఏడవ తేదీన తెలుగులో కూడా ఛావా చిత్రాన్ని గీత ఆర్ట్స్ బ్యానర్ వారు రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికి చాలా చోట్ల ఈ సినిమా థియేటర్లలో రన్ అవుతూ ఉన్నది ఇక ఓటిటి కోసం చాలా మంది అభిమానులు ఎదురుచూస్తూ ఉండగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమ్మింగ్ హక్కులను సైతం ప్రముఖ ఓటీటి  ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.సుమారుగా నెలరోజుల తర్వాత ఈ సినిమాని ఓటీటిలోకి తీసుకువచ్చేలా ముందుగానే డీల్ కుదుర్చుకున్నారట.



ఇటీవలే ఛావా సినిమా ఆన్లైన్లో కూడా హెచ్డి ప్రింట్ రావడంతో త్వరలోనే ఈ సినిమాని ఓటీటి లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెల 11వ తేదీన ఓటీటి లోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా రాబోతున్నదట. ఇందులో ప్రతి ఒక్కరి నటన కూడా అద్భుతంగా ఉందని ఈ చిత్రంలోని ప్రతి పాత్రలు కూడా అందరిని ఆకట్టుకునేలా కనిపించాయి. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ అందించినటువంటి సంగీతం కూడా ఛావా సినిమా సక్సెస్ లో ఒక కీలకమైన పాత్ర పోషించిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: