
ఆమె ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ చూస్తే హిందీ సినిమాకు ఆమె ఇచ్చే ప్రాధాన్యం ఏంటో తెలుస్తుంది .. అయితే ఇదే క్రమంలో సౌత్‌లో ఈమె ఓ సినిమా చేస్తే అది తప్పనిసరిగా హిందీలో కూడా రిలీజ్ అయ్యేలా ఉంటేనే ఆమె ఆ సినిమా చేయాలని నిర్ణయం తీసుకుంది మృణాల్ . ఇక తెలుగులో ఈమె అడివి శేష్‌కు జంటగా డికాయిట్ సినిమాలో నటిస్తుంది .. ఇక ఈ సినిమాను ఒకేసారి హిందీ , తెలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నారు .. తెలుగులో లేదా మిగిలిన సౌత్ ఇండస్ట్రీ నుంచి ఇలాంటి ద్విభాష పాన్ ఇండియా సినిమాలు వస్తేనే మృణాల్ చేయాలని భావిస్తుంది .. అందుకే ఇప్పటివరకు ఈమె ఒక తమిళ్ సినిమాకు కూడా ఓకే చెప్పలేదు .
తెలుగులో మంచి సక్సెస్ సాధించిన హీరోయిన్ కు ఆటోమేటిగ్గా కోలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తూ ఉంటాయి .. మృణాల్‌కు కూడా అలానే ఆఫర్లు వచ్చాయి .. కాకపోతే కేవలం ఒక ఇండస్ట్రీకి ఫిక్స్ అయిపోవడం ఆమెకు ఇష్టం లేదు .. తమిళంలో చేసే సినిమా సమాంతరంగా హిందీలో కూడా రిలీజ్ అయితేనే చేయడానికి ఈమె ఓకే చెబుతుంది అలాంటి ప్రాజెక్టులు ఆమె వద్దకు వెళ్ళటం లేదు .. ఇక 32 సంవత్సరాల మృణాల్ ప్రస్తుతం సౌత్లో తక్కువగా బాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది .. అలాగే సౌత్ సినిమాల విషయంలో ఆమె ఎక్కడ తొందరపడటం లేదు ఆచితూచిగా కథలను ఎంచుకుంటోంది .