న్యాచురల్ స్టార్ నాని శేలేష్ కొలను కాంబినేషన్ లో తెరకెక్కిన హిట్3 సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది మే నెల 1వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన ప్రేమ వెల్లువ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
 
హిట్3 సినిమా నుంచి ఇలాంటి మెలోడీ సాంగ్ ను అస్సలు ఊహించలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. విడుదలైన గంటలోనే ఈ సాంగ్ కు లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. న్యాచురల్ స్టార్ నానికి జోడీగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి నటించారు. నాని, శ్రీనిధి జోడీ బాగుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. మిక్కీ జే మేయర్ తన మ్యూజిక్ తో ప్రాణం పోశారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
 
హిట్ సిరీస్ లో హిట్3 బెస్ట్ మూవీగా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. తొలిసారి సాంగ్ కొంతమంది ప్రేక్షకులకు నచ్చకపోయినా ఈ సాంగ్ కు రిపీట్ వాల్యూ ఎక్కువగా ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. నాని ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారు. హిట్3 మూవీ డిజిటల్ రైట్స్ 54 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని ఇండస్ట్రీ వర్గాల టాక్.
 
నాని కెరీర్ పరంగా అంచెలంచెలుగా ఎదుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నాని కెరీర్ పరంగా సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. నాని రెమ్యునరేషన్ ప్రస్తుతం 35 కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. నానిని అభిమానించే ఫ్యాన్స్ సైతం భారీ స్థాయిలో ఉన్నారు. నాని నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: