- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ రాజు వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ రాజు ది రాజా సాబ్ సినిమా చేస్తున్నారు. ఆ త‌ర్వాత వ‌రుస‌గా స‌లార్ 2, క‌ల్కి 2 , స్పిరిట్ సినిమాలు చేస్తున్నారు. ఇక ప్ర‌భాస్ త‌న‌తో సినిమాలు చేసే హీరోయిన్ల తో పాటు న‌టీ న‌టుల‌కు త‌న ఇంటి వంట‌కాలు పంపి మ‌రీ రుచి చూపిస్తారు. ప్ర‌భాస్ ప‌క్క‌న న‌టించే హీరోయిన్ల కు ఎప్పుడూ కూడా ఇలాంటి టేస్ట్ లు రుచి చూపిస్తూ ఉంటాడు. ఇక తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా.. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం లో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్. ఈ సినిమా ఇప్పుడు కంటిన్యుటి గా లూసీఫ‌ర్ 2 వ‌స్తోంది.


సినిమా ఈ నెల 27న రిలీజ్ అవుతోంది. ఈ నేప‌థ్యం లోనే శ‌నివారం  హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేయ‌గా . . . పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పలు ఆసక్తికర విశేషాలను ప్రేక్షకులకు వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలోనే పృథ్విరాజ్ మాట్లాడుతూ ప్ర‌భాస్ పంపిన మటన్‌ అంటే నాకు చాలా ఇష్టం అని .. మ‌రీ  ముఖ్యంగా మటన్‌తో చేసిన వంటకం నాకు చాలా బాగా నచ్చింద‌ని పృథ్వీరాజ్‌ సుకుమారన్ తెలిపారు. ఈ మ‌ట‌న్ వంట‌కాన్ని ప్ర‌తి ఒక్క‌రు కూడా టేస్ట్ చేయాల్సిందే అంటున్నారు పృథ్విరాజ్ సుకుమార‌న్ .


ఇక లూసిఫర్ సినిమాలో పృథ్వీరాజ్ చెప్పాలనుకున్న స్టోరీ థీమ్ బాగుంద‌ని ... ముఖ్యంగా సినిమా నిండా ఎమోషన్లు ఉన్న‌ట్టు చెప్పారు. అలాగే మోహన్ లాల్, వివేక్ ఒబెరాయ్ , మంజు వారియర్ పాత్రలు కూడా సినిమాలో చాలా హైలెట్ అవుతాయంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: