- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా వ‌రుస‌గా చేస్తోన్న సినిమాలు అన్నీ సూప‌ర్ డూప‌ర్ హిట్లు కొడుతున్నాయి. అఖండ - వీర‌సింహా రెడ్డి - భ‌గ‌వంత్ కేస‌రి - ఇక తాజాగా సంక్రాంతికి డాకూ మహారాజ్ ఇలా నాలుగు హిట్లు బాల‌య్య ఖాతాలో వ‌రుస‌గా ప‌డ్డాయి. దాదాపు 30 ఏళ్ల త‌ర్వాత ఇది జ‌రిగింది. ఇక బాల‌య్య ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం లో అఖండ 2 - తాండ‌వం సినిమా లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా పై సాలిడ్ అంచనాలు నెలకొన్నాయి.


అఖండ మొదటి భాగమే ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేశారు నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి. ఆ సినిమా అప్ప‌ట్లో త‌క్కువ టిక్కెట్ రేట్ల‌తోనే భారీ లాభాలు ఆర్జించింది. అదిరిపోయే వ‌సూళ్లు అఖండ కొల్ల‌గొట్టింది . ఇక‌ ఇపుడు అఖండ 2 పై మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు ఒక్కొక్క‌టి గా బ‌య‌ట‌కు వినిపిస్తున్నాయి. దీంతో పార్ట్ 2 కోసం మాత్రం ఆడియెన్స్, అభిమానులు ఊహించని లెవెల్ ప్లానింగ్స్ బోయపాటి చేస్తున్నాడ‌ట‌. మెయిన్ గా ఈ సినిమా కోసం ద‌ర్శ‌కుడు బోయ‌పాటి భారీ సెట్టింగ్స్ వేయించిన‌ట్టు టాక్ ?


ఇక అఖండ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఉన్నట్టుగానే పరమ శివుని భారీ విగ్రహం లా నే పార్ట్ 2 లో దానికి మించిన పవర్ఫుల్ సెట్టింగ్స్ వేయించిన‌ట్టు స‌మాచారం. ఏదేమైనా పార్ట్ 2 తాండవం మాత్రం మామూలుగా ఉందని సినీ వర్గాల్లో టాక్ గ‌ట్టి గా వినిపిస్తోంది. ఇక ఈ సినిమా కు థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఈ సినిమా లో సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: