సాధారణంగా సెలబ్రిటీల మీద ఏవో ఒక రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి.. ముఖ్యంగా కొంతమంది సెలబ్రిటీలను చూడగానే చాలామంది వారిని ముట్టుకోవాలని ,ముద్దు పెట్టుకోవాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దీంతో చాలామంది సెలబ్రెటీలు అలా హద్దులు మీరి ప్రవర్తించినప్పుడు తగిన బుద్ధి చెబుతూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేయడానికి హైదరాబాదుకి   ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బాలీవుడ్ నటి పైన కొంతమంది గుర్తుతెలియని యువకులు ఆత్యాచారయత్నానికి పాల్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా హైదరాబాదులోనే అన్నట్లుగా సమాచారం.


పూర్తి వివరాల్లోకి వెళితే ఈనెల 18వ తేదీన షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేయడానికి హైదరాబాదుకు ఒక బాలీవుడ్ నటి వచ్చిందట.. అది కూడా మాసబ్ ట్యాంక్ సమీపంలో ఉండేటువంటి కాలనీలో ఆమె అదే రాత్రి స్టే చేసింది.. అయితే ఈ విషయం గమనించిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సైతం ఆమె రూములోకి దొంగగా చొరబడ్డారు.. ఆ నటిని తమకు సహకరించాలని చాలా ఒత్తిడి చేయడమే కాకుండా ఎక్కడపడితే అక్కడ తాకుతూ చాలా అసభ్యకరంగా ఆమెతో ప్రవర్తించారట.. అంతేకాకుండా ఆమె నోట్లో గుడ్డలు కుక్కి మరి అత్యాచార ప్రయత్నం చేసేందుకు ప్రయత్నించారని.. ఆమె ఒప్పుకోకపోవడంతో చేతులు కాళ్లు కట్టేసి మరి ఆమె దగ్గర ఉండే డబ్బు బంగారు తీసుకొని పారిపోయారట.


వెంటనే ఆ నటి హుటాహుటిగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి మరి దర్యాప్తు చేపడుతున్నారట. అయితే తన స్నేహితురాలు పిలవడంతోనే ఆమె హైదరాబాదుకు వచ్చానని పోలీసులకు తెలియజేసింది. అయితే మరి ఆ నటి ఎవరనే విషయం మాత్రం ఇంకా తెలియడం లేదు మరి ఈ విషయం నిజమో కాదో కూడా తెలియడం లేదు కానీ మొత్తానికి తెలుగు సినీ ఇండస్ట్రీలో అటు హైదరాబాదులో ఈ విషయం సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: