టాలీవుడ్ ఇండస్ట్రీలో వెంకటేష్ రోజా మధ్య గొడవలు ఉన్నాయని,వారిద్దరి మధ్య సఖ్యత లేదని చాలా రోజుల నుండి వినిపిస్తున్న టాక్.. అయితే వెంకటేష్ నటించిన ఓ సినిమాలో మొదట రోజాని తీసుకొని ఆ తర్వాత రోజాని తీసేసి సౌందర్యని తీసుకోవడంతో ఈ వివాదం స్టార్ట్ అయిందని రూమర్లు ఉన్నాయి. అయితే తమిళంలో హిట్ అయిన ఓ సినిమాని తెలుగులో రీమేక్ చేశారు. తమిళంలో హిట్ అయిన సినిమాలో రోజా హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత అదే సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్న సమయంలో వెంకటేష్ సరసన హీరోయిన్ గా రోజాని అనుకొని ఆ తర్వాత ఆమెను తీసేసారు నిర్మాతలు. అయితే రోజాని పక్కనపెట్టి హిట్ పెయిర్ అయినటువంటి సౌందర్యని ఆ సినిమాలో తీసుకోవడంతో ఈ వివాదం స్టార్ట్ అయింది.

అయితే ఇందులో వెంకటేష్ తప్పేమీ లేదు. కానీ రోజా మాత్రం వెంకటేష్ సౌందర్యలని ఇష్టారీతిన తిట్టుకుందట. అంతేకాదు సౌందర్యని తీసుకోవడం కోసమే వెంకటేష్ తనని పక్కన పెట్టారు అని విమర్శించిందట. అయితే ఈ విమర్శలు పేపర్లో ప్రచురించే ముందు మొదట వెంకటేష్ ని కలిశారట. ఆ టైంలో వెంకటేష్ హీరోయిన్ ని సెలెక్ట్ చేసే ఛాన్స్ నాకు ఉండదు.అదంతా నిర్మాతల పనే. నిర్మాతనే సెలెక్ట్ చేస్తారు. ఇందులో నా జోక్యం ఏమీ ఉండదు అని చెప్పారట. కానీ రోజా మాత్రం అది వెంకటేష్ పనే అని ఆరోపించిందట. అలా వెంకటేష్ ని రోజాసినిమా నుండి దూరం పెట్టేసిందట.

 అయితే వెంకటేష్ రోజా కాంబినేషన్లో వచ్చిన పోకిరి రాజా సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ వీరి కాంబోలో సినిమా వస్తే పోకిరి రాజా మూవీ ఎఫెక్ట్ ఆ సినిమాపై పడుతుంది అనే ఉద్దేశంతో నిర్మాతలు రోజాని పక్కన పెట్టారట.కానీ ఈ విషయం తెలియని రోజా వెంకటేష్ కావాలనే తనని తీసేసి సౌందర్యను పెట్టుకున్నారని ఊహించుకొని వెంకటేష్ సౌందర్యల పై విమర్శలు చేసింది అంటూ సంచలన కామెంట్లు చేశారు ప్రముఖ రచయిత తోట ప్రసాద్.

మరింత సమాచారం తెలుసుకోండి: