థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో సమానంగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ వారం సినీ ప్రియులకు పండగానే చెప్పాలి. ఎందుకంటే ఈ వారం పాపులర్ సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యాయి. అయితే స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు ఏవో తెలుసుకుందాం. అలాగే ఉగాది పండుగ కానుకగా బాక్సాఫీస్ వద్ద మంచి సినిమాలు కూడా రిలీజ్ అవ్వనున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో కూడా చూద్దాం రండి.
 
మొదటగా ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాల లిస్ట్ చూద్దాం. హాట్ స్టార్ లో ముఫాసా: ది లయన్ కింగ్ సినిమా మార్చి 26 నుండి స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ముఫాసా పాత్రకు మహేష్ బాబు వాయిస్ అందించారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన జీ5లో విడుదల పార్ట్ 2 సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. అలాగే నెట్ ఫ్లిక్స్ వేదికగా మిలియన్ డాలర్ సీక్రెట్ సినిమా ఈ నెల 26 నుండి స్ట్రీమింగ్ అవ్వనుంది.


ఇకపోతే ఉగాది కానుకగా థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాల లిస్ట్ ఏంటో చూద్దాం. స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన ఎల్2 ఎంపురాన్ సినిమా ఈ నెల 27న రిలీజ్ కానుంది. హీరో విక్రమ్ నటించిన వీర ధీర శూర సినిమా కూడా మార్చి 27న విడుదల అవ్వనుంది. అలాగే 28న హీరో నితిన్ నటించిన రాబిన్ హుడ్ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. మ్యాడ్ స్క్వేర్ సినిమా కూడా 28న విడుదల కానుంది. మార్చి 30న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: