
ఇక ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులకు అంచనాలు పెరిగాయి. ఈ సినిమా రిలీజ్ కోసం అటు నితిన్, ఇటు శ్రీలీల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ ముఖ్య పాత్ర పోషించారు. ఈ మూవీలో డేవిడ్ వార్నర్ ఫస్ట్ లుక్ ని ఇటీవలే మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. బౌండరీ నుండి బాక్స్ ఆఫీస్ కు వస్తున్న వార్నర్ కి భారత సినిమా స్వాగతం అంటూ ఆ పోస్టర్ కి ట్యాగ్ లైన్ జత చేశారు. ఇక ఈ పోస్టర్ నేటింటా తెగ వైరల్ అయ్యింది.
అయితే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్, టైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్బంగా హీరో నితిన్ మాట్లాడారు. హీరో నితిన్ మాట్లాడుతూ.. 'మూవీ మేకర్స్ అందరికీ థాంక్ యూ. సినిమా చాలా బాగుంటుంది. ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందని నేను చాలా నమ్మకంతో ఉన్నాను. డేవిడ్ వార్నర్ కి థాంక్ యూ. మీరు ఈ సినిమాలో నటించడం వల్లే ఈ సినిమా మరో స్థాయికి వెళ్లింది. ఈ సినిమాలోని డేవిడ్ వార్నర్ పాత్ర ఈ సినిమాని ఇంకో లెవెల్ కి తీసుకెళ్తుంది. డేవిడ్ వార్నర్ ఎలా అయితే క్రికెట్ రంగంలో ఆడడానికి ఆసక్తి చూపిస్తారో.. అలాగే సినిమా రంగంలో కూడా ఆసక్తి చూపిస్తూ నటించారు' అని నితిన్ చెప్పుకొచ్చారు.