
ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియజేశారు. ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమా పూర్తి అయిపోయిన వెంటనే తాను కూడా తన కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయబోతున్నానని.. ఇక ప్రభాస్ కూడా స్పిరిట్ సినిమాని పూర్తి చేయవలసి ఉన్నది అంటూ ఆ తర్వాతే తాను ప్రభాస్ సలార్ 2 సినిమా షూటింగ్లో కలుస్తామంటూ తెలియజేశారు. మొత్తానికి అటు ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీ, ప్రభాస్ స్పిరిట్ మూవీ రెండు పూర్తి చేసిన తర్వాతే సలార్ 2 సినిమా రిలీజ్ చేయబోతారని చెప్పకనే తెలియజేశారు.
సలార్ మొదటి భాగం 2023 డిసెంబర్ 22న రిలీజ్ కాగా ఆ తర్వాత ప్రభాస్ ఎన్నో చిత్రాలను ఒప్పుకోవడం జరిగింది.. దీంతో సలార్ 2 సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అనే సందేహాలు అభిమానులు ఉన్నప్పటికీ పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అన్నిటికీ క్లారిటీ ఇచ్చేసింది. ఇక సలార్ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ నటించారు.జగపతిబాబు , బాబి సింహ, శ్రీయా రెడ్డి వంటి వారు కీలకమైన పాత్రలలో నటించారు. ప్రభ ప్రస్తుతం రాజా సాబ్, స్పిరిట్, కల్కి-2 , సలార్ 2 వంటి చిత్రాలలో నటించబోతున్నారు. మరి ఈ చిత్రాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అయితాయా అనే విషయం పైన చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.