టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అందంతో చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి సమంత ముందు వరుసలో ఉంటారు. ఈ చిన్నదాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చిత్ర పరిశ్రమలో సమంత తన నటన, అందంతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకునదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


ఈ చిన్నది ఎప్పటికప్పుడు ఏదో ఒక సినిమాతో అభిమానుల ముందుకు వస్తూనే ఉంటుంది. ఇక సమంత చిత్ర పరిశ్రమలో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించింది. సమంత ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతోంది. సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ చిన్నది సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించి ఏదో ఒక ఫోటోను షేర్ చేసుకుంటూ వైరల్ అవుతూనే ఉంటుంది.


కాగా, సమంత సమయం దొరికినప్పుడల్లా తన అభిమానులతో ముచ్చటిస్తూ, వారిని పలకరిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం సమంతకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ గా మారింది. సమంత టాలీవుడ్ సినీ నటుడు నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఏవో కొన్ని మనస్పర్ధల కారణంగా అతి తక్కువ సమయంలోనే వీరు విడాకులు తీసుకున్నారు. ఈ విషయం పైనే తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. సమంత విడాకుల సమయంలో తన పుట్టింటికి వెళ్ళిపోయిందట.


ఆ సమయంలో నాగచైతన్య సమంతను విడాకులు తీసుకోకుండా ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారట. ప్రతిరోజు సమంతకు ఫోన్ చేసే వాడట. అర్ధరాత్రి, పగలు అనే తేడా లేకుండా సమంతను బుజ్జగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారట. కానీ అప్పటికే సమంత మనసు బాధపడటంతో నాగచైతన్యతో విడాకులు తీసుకోకుండా ఉండలేకపోయారట. ఈ విషయం తాజాగా సమంత సన్నిహితుల ద్వారా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: