
ఈ మధ్యకాలంలోనే హోస్టుగా మారి అన్ స్టాపబుల్ షోను ముందుకు తీసుకెళ్లారు . అయితే కెరియర్ లో ఫస్ట్ టైం బాలకృష్ణ స్టార్ హీరో సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు అన్న టాక్ వైరల్ గా మారింది . రీసెంట్గా "డాకు మహారాజ్ " సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న బాలయ్య ఇప్పుడు అఖండ 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా అయిపోయిన వెంటనే స్టార్ డైరెక్టర్ లు బాలయ్యతో సినిమా చేయడానికి క్యూకట్టి ఉన్నారు .
కాగా బాలయ్య ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాగా ఇప్పుడు బాలయ్య ఒక హీరో సినిమాలో గెస్ట్ పాత్ర చేయడానికి ఓకే చేశారట . ఆ హీరో మరెవరో కాదు మాస్ మహారాజా రవితేజ . గోపీచంద్ మల్లినేని తో రవితేజ ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ టాక్ వినిపించింది. అయితే ఈ సినిమాలో ఒక కీలకపాత్ర కోసం బాలయ్యను కూడా అప్రోచ్ అయ్యారట. బాలయ్యకు గోపీచంద్ మీద ఉన్న గౌరవంతో ఇష్టంతో ఈ పాత్రను ఓకే చేశారట . సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. బాలయ్య ఏ పని చేసిన సరే అది సూపర్ హిట్ అయినట్టే అంటూ నందమూరి ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు . ఇక బాలయ్య - రవి తేజ కాంబో అంటారా కెవ్వు కేకే అంటూ ఓరేంజ్ లో హైప్ పెంచేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్..!