సౌత్ సినీ ఇండస్ట్రీలో మార్షల్ ఆర్ట్స్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. ముఖ్యంగా హీరో పవన్ కళ్యాణ్ , విజయ్ దళపతి ఇద్దరు కూడా ఒకే వ్యక్తి దగ్గర శిక్షణ పొందారు.. ఆ నటుడు ఎవరో కాదు మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు షిహాన్ హుస్సేని. అలా ఆయన దగ్గర మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని మరి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వారి కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు. అయితే ఈ నటుడు పవన్ కళ్యాణ్ గురువు అయినటువంటి  షిహాన్ హుస్సేని గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారట.


దీంతో ఇటీవలే షిహాన్ హుస్సేని కన్ను మూసినట్లు తెలుస్తోంది. ఈయన లుకేమియా తో బాధపడుతూ చెన్నైలో ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారట. ఈయన మృతికి పలువురు సినీ సెలబ్రిటీలు సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఈయన వద్ద కరాటే కిక్ బాక్సింగ్ పవన్ కళ్యాణ్ నేర్చుకొని బ్లాక్ బెల్ట్ ని సైతం సాధించారట. అయితే ఈయన అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా తన ఇబ్బందులను గురించి తెలియజేయడం జరిగింది.


ముఖ్యంగా ఈయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ తను మాత్రం కరాటే మనిషిని కాబట్టి.. తనని ఎలాంటి అనారోగ్య సమస్యలు దూరంగా కరాటేకి ఉంచలేకపోయాయని అదే మార్షల్ ఆర్ట్స్ కు ఉన్న గొప్పతనం అంటూ ఆయన తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకానొక సమయంలో తను మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇస్తున్నటువంటి కేంద్రాన్ని కూడా అమ్మడానికి సిద్ధమయ్యారని తెలియజేశారు. అంతేకాకుండా తన పూర్వ విద్యార్థి అయిన పవన్ కళ్యాణ్ ను ఆ శిక్షణ కేంద్రాన్ని తీసుకోమని కూడా సలహా ఇచ్చారట. పవన్ కళ్యాణ్ కి పేరు పెట్టింది కూడా షిహాన్ హుస్సేని అని తెలియజేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కూడా తనకి బాగా తెలుసని.. అందుకే శిక్షణ కేంద్రాన్ని తీసుకుంటే రాబోయే తరాలకు నిర్వహిస్తారేమో అని ఆశించాను అంటూ ఒకానొక ఇంటర్వ్యూలో తెలియజేశారు. మరి తన గురువు మరణ వార్తతో పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: