తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో ఒకరు అయినటువంటి నితిన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటి వరకు నితిన్ ఎన్నో విజయాలను అందుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం నితిన్ కి సరైన విజయం రాలేదు. కొంత కాలం క్రితం ఈయన మాచర్ల నియోజకవర్గం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి అపజయాన్ని అందుకున్నాడు. ఆఖరుగా నితిన్ "ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి అపజయాన్ని అందుకున్నాడు.

ఇకపోతే తాజాగా నితిన్ "రాబిన్ హుడ్" అనే సినిమాలో హీరోగా నటించాడు. శ్రీ లీలా ఈ మూవీ లో హీరోయిన్గా నటించగా ... వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. జీ వీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. మార్చి 28 వ తేదీన ఈ మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు పెద్ద ఎత్తున ప్రచారాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు.

మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఈ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ మూవీ ట్రైలర్ కు 24 గంటల్లో 11.09 మిలియన్ వ్యూస్ ... 209 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ ట్రైలర్ కు 24 గంటల్లో ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: