
నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్య మైన సినిమా లలో నటించారు. బాలయ్య ఎన్ని సినిమా లలో నటించినా కూడా బాలయ్య కెరీర్ లో వైవిధ్యమైన సినిమా లలో ఆదిత్య 369 సినిమా ఒకటి. ఈ సినిమా వెనక చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి. హెచ్.జి. వెల్స్ రాసిన 'టైమ్ మెషీన్' నవల కాలేజీ రోజుల్లో చదివి బాగా ఆకర్షితులైన సింగీతం ... ఆ తరహాలో ఎప్పటికైనా సినిమా చేయాలనుకున్నారు. అలా తయారైందే ‘ ఆదిత్య 369 ’ కథ. ఇక ఈ సినిమా లో ముందుగా కథానాయికగా విజయశాంతిని అనుకొన్నారు. అప్పుడామె చాలా బిజీగా ఉండటంతో డేట్లు సర్దుబాటు చేయడం కష్టమైంది. బాలయ్య - విజయశాంతి ది క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ డిఫరెంట్ స్టోరీకి ఆమె హీరోయిన్ అయితేనే కరెక్ట్ అని దర్శకుడు అనుకున్నా విజయశాంతి బిజీ షెడ్యూల్ తో డేట్లు ఇవ్వలేకపోయారు.
ఈ క్రమంలో నే బాలయ్య కు జోడీగా ఎవరిని తీసుకోవాలా అని ఆలోచిస్తుంటే పి.సి. శ్రీరామ్ తమిళంలో ఓ సినిమాలో చేస్తున్న మోహినిని పరిచయం చేశారు. ఈ సినిమాకు మొత్తం 110 రోజులు పనిచేశారు. ఫ్యూచర్ ఎపిసోడ్ తీయడానికి ఎక్కువ రోజులు పట్టింది. టైటిల్ కోసం చాలా మథనపడ్డారు. టైమ్ మెషీన్ నేపథ్యం కాబట్టి ' కాలయంత్రం ' అని పెడతారేమోనని చాలామంది ఊహించారు. కానీ వీళ్లు గమ్మత్తుగా ' ఆదిత్య 369 ' అని ప్రకటించడంతో అంతా ఆశ్చర్యపోయారు. చివరకు సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతోంది. ఈ సినిమా ఇప్పటి జనరేషన్ కు కూడా పిచ్చ పిచ్చగా నచ్చుతుంది. టాలీవుడ్ లోనే కాదు బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైం కల్ట్ క్లాసిక్ సినిమా లలో ఒకటిగా నిలిచింది.