
టాలీవుడ్లో మార్చి నెలలో కోర్ట్ రూపంలో ఓ మంచి విజయం దక్కింది. మరో హిట్టు పడితే ఈ నెలని హ్యాపీగా ముగించవచ్చు. వచ్చే వారంలో ఐదు సినిమాలు వస్తున్నాయి .. ఐదు విభిన్న కథాంశాలు కావడంతో వాటిలో ఏదో ఒకటి కచ్చితంగా హిట్ అవుతుందన్న నమ్మకాలు ఉన్నాయి. రాబిన్ హుడ్ - మ్యాడ్ - లూసిఫర్ - వీర ధీర శూర ఈ వారం ప్రేక్షకులని పలకరించనున్నాయి. మొదటి రెండు డైరెక్టు సినిమాలైతే మిగిలినవి డబ్బింగ్ బొమ్మలు. నితిన్ రాబిన్ హుడ్‌గా మారిపోయాడు. శ్రీలీల హీరోయిన్ .. డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ వెంకీ కుడుమల డైరెక్టర్ కావడంతో సినిమాపై అంచనాలు ఉన్నాయి. మ్యాడ్ టు కూడా ఈ నెల 28న రిలీజ్ అవుతుంది. సితార నుంచి వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ లో అవుతున్నాయి. ఈ సినిమా రాబిన్ హుడ్ కు గట్టి పోటీ ఇస్తుంది అనటంలో సందేహం లేదు. మోహన్ లాల్ లూసిఫర్ 2 ఈ వారమే వస్తుంది. ఈనెల 27న రిలీజ్ అవుతుంది.
మోహన్ లాల్ హిట్ సినిమాలలో లూసీఫర్ ఒకటి. ఇక తెలుగులోనూ ఇప్పుడు లూసీఫర్ 2 మీద క్రేజ్ ఉంది. తెలుగులో దిల్ రాజు విడుదల చేస్తున్నారు. కాబట్టి థియేటర్ల విషయంలో పెద్దగా బెంగ పడాల్సిన అవసరం లేదు. ఇక కోలీవుడ్ క్రేజీ హీరో విక్రమ్ సినిమా ‘ వీర ధీర శూర ’ కూడా ఈవారమే వస్తోంది. మిగిలిన 3 సినిమాలతో పోలిస్తే బజ్ తక్కువ ఉన్నా ఎస్. జె. సూర్య కీలక పాత్ర పోషించడంతో అంచనాలు ఉన్నాయి. తంగలాన్ తర్వాత విక్రమ్ చేస్తోన్న సినిమా ఇదే. ఇక ఈ సినిమా లతో పాటు బాలీవుడ్ సినిమా ‘ సికిందర్ ’ కూడా ఈనెలాఖరులో విడుదల అవుతోంది. సల్మాన్ - రష్మిక జంటగా నటించిన ఈ సినిమా కు మురుగదాస్ దర్శకుడు. బీసీల్లో కాకపోయినా ఏ సెంటర్లలో సల్మాన్ సినిమా ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఏదేమైనా ఓవరాల్ గా 5 సినిమాలతో ఈవారం ప్రేక్షకుల వినోదానికి అయితే ఢోకా లేదు. వీకెండ్‌తో పాటు రంజాన్ సెలవులు కూడా కలిసొస్తాయి.