హీరో, హీరోయిన్ కైనా ఏదో ఒక సినిమా టర్నింగ్ పాయింట్ గా పిలుస్తుంది. కొంతమందిని ఒక్క సినిమానే ఓవర్ నైట్ లో స్టార్ ను చేస్తుంది. కొంతమందికి చేయగా చేయగా స్టార్ డం వస్తుంది. అలా హీరో యష్ కూడా  కేజిఎఫ్ ముందు ఒక విధంగా కేజీఎఫ్2 తర్వాత మరో విధంగా  తయారయ్యారు. కేజిఎఫ్2 సినిమా తర్వాత యష్ పేరు  ఇండియన్ హద్దులు దాటిపోయింది.. యష్ అంటే కేజిఎఫ్ అనే విధంగా తయారయింది. అలా  పాపులారిటీ సంపాదించుకున్న సినిమా కేజిఎఫ్, కేజిఎఫ్2. ఈ సినిమాలు వచ్చి ఇప్పటికే మూడు సంవత్సరాలు దాటిపోయింది. అయితే తాజాగా ఈ హీరో టాక్సిక్ ఏ ఫెరీ టేల్  ఫర్ గ్రోన్ ఆప్స్ మూవీ లో  నటిస్తున్నారు. ఈ సినిమా కోసం యష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయినటువంటి టీజర్  ప్రతి అభిమానిని ఆకట్టుకుంది. ఈ విధంగా ఆల్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న యష్ తాజాగా  ఒక ఈవెంట్ లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. తాజాగా బెంగళూరులో జరిగినటువంటి మనడ కథలు సినిమా  ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా  యష్ వెళ్లారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ' ప్రతి ఒక్క నటుడికి జాగ్రత్త అనేది చాలా అవసరం అని చెప్పుకొచ్చారు. అంతేకాదు నేను ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలో ప్రతి డైరెక్టర్ నుంచి స్టోరీ కాపీ ఇవ్వమని అడిగేవాడిని.

ఎందుకంటే కథ పూర్తిగా నాకు అర్థం అయితే నటించడం ఈజీ అయిపోతుంది. అలా నేను కథ అడిగేసరికి చాలామంది  నాకు పొగరు బాగా ఉంటుందనుకున్నారు. ఈ విషయాన్ని ఇండస్ట్రీ మొత్తం స్ప్రెడ్ చేయడంతో నాకు చాలా అవకాశాలు తగ్గిపోయాయి.. కానీ నేనెప్పుడూ బాధపడలేదు మనల్ని నమ్ముకొని వచ్చిన వారందరికీ తప్పకుండా మంచి రిజల్ట్ ఇవ్వాలి కాబట్టి నేను కథ అడిగేవాడిని.. ఈ సందర్భంగా యష్ ఈ కామెంట్స్ చేయడంతో ఆయన ఎవరిని ఉద్దేశించి ఇలా మాట్లాడారో అనేది నేటిజన్స్ వెతికే పనిలోపడ్డారు..

మరింత సమాచారం తెలుసుకోండి: