ఏపీ వైసీపీ నేత వైఎస్ జగన్ ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పార్టీ పుంజుకోవాలని జగన్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు అయితే కనిపించడం లేదు. అయితే భవిష్యత్తులో జగన్ ను ఓడించి తీరతామని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కామెంట్లు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. పులివెందులలోనే జగన్ ను ఓడించి తీరతామని ఆదినారాయణ రెడ్డి చెబుతున్నారు.
 
ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతం ప్రభుత్వ విప్ గా కూడా ఉన్న సంగతి తెలిసిందే. జగన్ ధన దాహానికి అడ్డు లేకుండా పోయిందని పులివెందులలో తాగునీరు లేని పరిస్థితికి ఇదే కారణమని బీజేపీ నేత అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. పులివెందుల లాంటి ప్రాంతాలలో సైతం తాగునీటి కొరత ఉందని బీజేపీ నేత చెప్పుకొచ్చారు. పోలవరం, అమరావతికి జగన్ అన్యాయం చేశారని ఆయన పేర్కొన్నారు.
 
ఏపీలో కూటమి సర్కార్ కు తిరుగులేదని భవిష్యత్తులో సైతం రాష్ట్రంలో కూటమిదే అధికారమని ఆయన చెబుతున్నారు. పులివెందులతో పాటు ఉమ్మడి కడప జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో సైతం ఇదే పరిస్థితి ఉందని ఆది నారాయణరెడ్డి వెల్లడిస్తున్నారు. మరి ఆది నారాయణరెడ్డి మాటలు నిజం అవుతాయో లేదో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందేనని చెప్పవచ్చు.
 
అయితే ఆది నారాయణ రెడ్డి కామెంట్ల గురించి బీజేపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది. ఏపీలో రాబోయే రోజుల్లో బీజేపీ మరింత పుంజుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చెప్పిన పథకాలను, ఇచ్చిన హామీలను అమలు చేస్తే మాత్రం రాష్ట్రంలో బీజేపీకి తిరుగుండదని చెప్పవచ్చు. 2029 సంవత్సరంలో కూడా కూటమి ఏపీలో అధికారంలోకి వస్తుందేమో చూడాలి. జగన్ మాత్రం రాష్ట్రంలో పార్టీ పుంజుకునే దిశగా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. జగన్ రాజకీయాలలో మరిన్ని సంచలనాలను సృష్టిస్తే వైసీపీ శ్రేణులు ఎంతో సంతోషిస్తాయని కచ్చితంగా చెప్పవచ్చు.






మరింత సమాచారం తెలుసుకోండి: