తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న బెట్టింగ్ యాప్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది . ఇప్పటికే ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం తో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన ప్రముఖ సిని సెలబ్రిటీలు చుట్టూ గట్టిగా ఉచ్చు బిగుస్తుంది .. అయితే ఇప్పుడు ఈ లిస్టు చూస్తే కాస్త పెద్దదిగానే కనిపిస్తుంది . ప్రధానంగా టాలీవుడ్ ప్రముఖ హీరోల నుంచి సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు అందరూ బెట్టింగ్ య‌ప్ లకు ప్రమోటర్లుగా ఉన్నారు .. దగ్గుబాటి రానా , విజయ్ దేవరకొండ , ప్రకాష్ రాజ్ , మంచు లక్ష్మి తో సహా 25 మంది నటులు ఇన్‌ఫ్లూయెన్సర్లు ఈ కేసులో గట్టిగా బుక్ అయ్యారు . అయితే ఈ కేసుకు సంబంధించిన ఇంకా ఎంక్వయిరీని పోలీసులు మొదలు పెట్టలేదు .. మరోపక్క పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వ్యవహారంలో బుల్లితెర నటులు యాంకర్లు హర్ష సాయి ,విష్ణు ప్రియ, లోకల్ నాని ఇలా 11 మందిపై కేసు నమోదు అయింది . అయితే ఎప్పుడు సెలబ్రిటీలపై నమోదు అవుతున్న వరుసకే సుల నేపథ్యంలో తాజాగా మరో కీలక పరిణామం ఈరోజు చోటుచేసుకుంది ..
 

వీటన్నిటికీ ప్రధాన కారణం య‌ప్‌లే కాబట్టి వాటి నిర్వాహకుల్ని కూడా ఇందులో నిందితులుగా చేర్చాలని వారిని విచారణకు పిలవాలని కీలక నిర్ణయం తీసుకున్నారు .  ఇక దీంతో ఈ కేసులో బెట్టింగ్ యాప్ ల నిర్వహకుల్ని కూడా నిందితులుగా చేర్చుతూ మియాపూర్ పోలీస్ లు చర్యలు చేపట్టారు .. ఇలా మొత్తంగా 19 యాప్ ల పేర్లను నిందితుల జాబితాలో చేర్చారు ... జంగ్లీ రమ్మీ డాట్‌కామ్, ఏ23, యోలో247డాట్‌కామ్, ఫెయిర్‌ప్లే, జీత్‌విన్, వీఎల్‌బుక్, తాజ్‌77, వీవీబీబాక్, ధని బుక్‌365, మామ247, తెలుగు365, యెస్‌365, జై365, వీవీబుక్, ఓకేవిన్, జెట్‌ఎక్స్, పరిమ్యాచ్, తాజ్‌777బుక్, ఆంధ్రా365 తదితర యాప్‌ల పేర్లను ఇందులో చేర్చారు .. అదే విధంగా బెట్టింగ్ యాప్లకు ప్రమోటర్లుగా ప‌లు ప్రమోషన్స్ లో నటించిన పలువురు నటులు ఇన్ఫ్లెన్సర్లకు నోటీసులు కూడా ఇచ్చి విచారించే ముందు పోలీస్ లు ప్రధానంగా న్యాయ సలహా తీసుకోబోతున్నారు మొదట బెట్టింగ్ యాప్స్ నిర్వహకులకు మీడియేటర్లకు విచారించిన ఆ తర్వాత సెలబ్రిటీలను విచారణకు పిలవనున్నట్లు తెలుస్తుంది .

 

అయితే తెలంగాణలో బెట్టింగ్ య‌ప్‌ల‌పై నిషేధం ఉన్న విషయం తెలిసిందే .  ప్రమోటర్ల మాటలు నమ్మి దాదాపు 1000 మంది ఈ యాప్స్‌ ద్వారా మోసపోయి ప్రాణాలు కూడా కోల్పోయారు .  ఇక దీంతో ప్రభుత్వం వీటిని నిషేధించింది .. అయితే బెట్టింగ్ నిర్వాహకులు మాత్రం వేరువేరు పేర్లతో ఎప్పటికప్పుడు రంగులు మార్చుతూ బెట్టింగ్ యాప్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తూన్న‌రు .. అయితే దీనిపై సీరియస్ అయినా రేవంత్ ప్రభుత్వం నిర్వాహకులపై గట్టిగా జులుము దులిపింది .. ప‌లు కోణాల్లో  నిర్వాహకులను విచారించి తెలంగాణ రాష్ట్ర నిబంధనలను ఉల్లంఘించినట్టు తెలిస్తే వారిపై ముందుగా గట్టి చర్యలు తీసుకుబోతున్నారు .. ఇక దీంతో ఖాకీలు యాప్ నిరాహాకుల‌ జాడను పసిగట్టే పనిలోపడ్డారు .. ఇప్పటికే ఐదు యాప్‌ల వివరాలు గుర్తించిన పోలీసులు త్వరలోనే మిగిలిన వాటి వివరాలు కూడా సేకరించబోతున్నారు .. అలాగే య‌ప్  యజమానులు తెరపైకి వస్తే బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసిన సెలెబ్రెటీలు ఈ కేసులో కేవలం సాక్షులుగానే ఉంటారు .. అంటే బెట్టింగ్ యాప్ కేసులో వాటిని ప్రమోట్ చేసిన ప్రముఖులంతా ఇకపై సాక్షులుగా ఉండబోతున్నారన్నమాట .. ఒకవేళ ఇదే జరిగితే కేసులు నమోదైన సెలబ్రిటీలు అంత‌ కేవలం సాక్ష్యం చెప్పి కోర్టు నుంచి వెళ్లిపోతారు మొత్తం సీన్ అంత బెట్టింగ్ యాప్ కంపెనీలపై ఉంటుంది కాబట్టి చర్యలన్నీ వారిపై ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: