రజినీకాంత్ సినిమాల్లో ఎలా ఉన్నప్పటికీ బయట మాత్రం ఆయన చాలా మంచి హృదయం కలవారని ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడంలో ముందుంటారని ఆయన చేత సహాయం పొందిన ఎంతోమంది ఎన్నో ఇంటర్వ్యూలలో బయటపెట్టారు. అయితే తాజాగా ఓ నటి రజినీకాంత్ గురించి చేసిన కామెంట్లు మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఇంతకీ ఆ నటి ఎవరయ్యా అంటే సీనియర్ నటి రమాప్రభ.. ఇండస్ట్రీకి వచ్చినా కొత్తలో హీరోయిన్ అవుదాం అనుకొని చివరికి కమెడియన్లకు భార్య పాత్రలు చేస్తూ లేడి కమెడియన్ గా బామ్మ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న రమాప్రభ 1400 కి పైగా సినిమాల్లో నటించింది. అయితే అలాంటి రమా ప్రభ తనకంటే వయసులో చిన్నవాడైన నటుడు శరత్ బాబుతో లివింగ్ రిలేషన్ లో ఉండి శరత్ బాబుని పెళ్లి చేసుకోవాలి అనుకుంది.

అయితే శరత్ బాబు అప్పుడే ఇండస్ట్రీకి రావడంతో రమాప్రభ సహాయం తీసుకొని ఆమెకు నచ్చినట్టు మెదిలి చివరికి ఇండస్ట్రీలో రాణించారు. ఇక రమాప్రభ డబ్బుతో పాటు పేరును కూడా వాడుకున్న శరత్ బాబు చివరికి ఆమెను మోసం చేయడంతో సంపాదించిన డబ్బులు అన్ని పోగొట్టుకున్న రమాప్రభ రోడ్డు మీద పడిందట. దాంతో ఎంతోమందిని సహాయం కోసం అడిగినా కూడా ఎవరూ కూడా ఆమెకు సహాయం చేయడానికి ముందుకు రాలేదట. దాంతో చివరికి రజినీకాంత్ ని కలిస్తే ఏదైనా ఉపయోగం ఉంటుంది అని కొంతమంది సన్నిహితులు చెప్పడంతో వెంటనే వెళ్లి రజినీకాంత్ ఇంటి ముందు నిలుచుందట.

అయితే రమాప్రభ ని చూసిన రజినీకాంత్ మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని. అడిగి లోపలికి రమ్మని అనగా ఆమెకు జరిగిన అన్యాయం మొత్తం చెప్పి తనకు ప్రస్తుతం కొంత డబ్బు సహాయం కావాలి అని చెప్పడంతో ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా రజినీకాంత్ తన లాకర్ లో ఉన్న 40,000 తీసి రమాప్రభ చేతిలో పెట్టారట. రజినీకాంత్ ఆ రోజు చేసిన సహాయాన్ని రమా ప్రభా ఇప్పటికి కూడా మర్చిపోకుండా రజినీకాంత్ గురించి గొప్పగా చెప్పుకుంటూ వస్తుంది. అలా రజినీకాంత్ చేసిన సహాయం ఆ రోజు రమాప్రభ అవసరాలను తీర్చిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: