
హై జవానీతో ఇష్క్ హునా హై చిత్ర బృందం మొత్తం కూడా రిషికేష్ కి వెళ్లడం జరిగింది.. ఈ క్రమంలోనే అక్కడ ఒక ఆశ్రమాన్ని కూడా సందర్శించి అక్కడ దిగినటువంటి పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది.ముఖ్యంగా రుద్రాక్ష మొక్క ను కూడా అక్కడ నాటారట. ఇకపోతే పూజా హెగ్డే ,వరుణ్ ధావన్ సోషల్ మీడియా వేదికగా తమ ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్టుని షేర్ చేయడం జరిగింది. అందులో వరుణ్ ధావన్, పూజా హెగ్డే ఇద్దరు కూడా బీచ్ లో దూకుతున్న ఫోటోలను సైతం షేర్ చేశారు.
ఈ పోస్టులకు సైతం రిషికేష్ లో తదుపరి షెడ్యూల్ తో మళ్ళీ కలుద్దాం అనే క్యాప్షన్ కూడా షేర్ చేయడం జరిగింది ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. అయితే ఈ వీడియోలో వారు ధావన్ , పూజా హెగ్డే పరిగెత్తుకుంటూ వెళ్లి మరి బీచ్ లో దూకగా.. పూజా హెగ్డే నెమ్మదిగా పరిగెడుతూ ఉండగా వరుణ్ ధావన్ స్పీడుగా పూజ హెగ్డేను లాక్కొని వెళ్లినట్టుగా కనిపిస్తోంది. మొత్తానికి బాలీవుడ్ హీరో తో పూజా హెగ్డే బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ వీడియో వైరల్ గా మారుతున్నది.