
మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనుకుని జాబితా ఉన్న దర్శకులలో వెంకి కుడుముల ఒకరు. భీష్మ తర్వాత వెంకీకి.. మెగాస్టార్ చిరంజీవి నుంచి కబురు వెళ్ళింది. ఓ కథని కూడా చెప్పారు. అది ఎంతకీ ముందుకు సాగలేదు. నిజానికి మల్లిడి వశిష్ట, అనిల్ రావిపూడి కి ముందే వెంకీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి. కానీ.. ఈ సినిమా ముందుకు వెళ్లడం లేదు. దీనికి గల కారణం ఏంటన్నది స్వయంగా వెంకీ చెప్పారు.
భీష్మ సినిమా తర్వాత చిరంజీవి గారి కోసం ఒక కథ అనుకున్నాను. ఆయన కి ముందు ఐడియా చెప్తే చాలా నచ్చింది. నేను చిరంజీవి గారికి అభిమానిని. ఆయనతో చేసే సినిమా చాలా స్పెషల్ గా ఉండాలని స్టోరీ స్క్రీన్ ప్లే డెవలప్మెంట్ కు చాలా టైం తీసుకున్నాను. అయితే ఎక్కడో చోట ఆయనని మెప్పించలేకపోయాను. మేము అనుకున్నది అనుకున్నలా అవలేదు. మరో కథతో వస్తానని చెప్పి వచ్చేసాను .. అలా జరిగిందని వెంకీ కూడా స్వయంగా చెప్పారు. దీంతో వెంకీ కుడుముల - చిరు కాంబినేషన్ ఎందుకు సెట్ అవ్వలేదా ? అన్న అనుమానాలకు కాస్త తెరపడింది.
అయితే ఎప్పటికైనా చిరంజీవితో సినిమా చేసి తీరుతా అని నమ్మకంతో ఉన్నారు వెంకీ కుడుముల. ఇక భీష్మ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాతో యువహీరో నితిన్‌కు తిరిగిలేని క్రేజ్ తెచ్చిపెట్టిన వెంకీ.. మరోసారి నితిన్‌తో కలిసి డైరెక్టు చేసిన రాబిన్‌హుడ్ సినిమా ఈనెల 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులందరికీ వస్తుంది. ఈ సినిమా కనుక సూపర్ డూపర్ హిట్ అయితే వెంకీ కుడుములకు .. మరోసారి మెగాస్టార్ తలుపులు తెరుచుకోవడం పెద్ద కష్టం కాదని చెప్పాలి. ఇక ఇప్పుడు వెంకీ ఆశలు అన్నీ కూడా రాబిన్ హుడ్ మీదే ఉన్నాయి.