
డిసెంబర్లో రావలసిన రాబిన్‌హుడ్.. కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది. నిజానికి ఈ సినిమాపై ఎవరికి పెద్దగా నమ్మకాలు లేవు. పైగా వాయిదాల మీద వాయిదాలు పడింది. నితిన్ వరుసగా ఫ్లాపుల్లో ఉన్నాడు. శ్రీలీల టైం అంతంత మాత్రమే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాబిన్‌హుడ్ సినిమాను టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు కూడా లైట్ తీసుకున్నాయి. క్రేజీ ప్రమోషన్ వల్ల రాబిన్‌హుడ్ మళ్లీ లైన్ లోకి వచ్చింది. అదిదా సర్ప్రైజ్ పాటలో స్టెప్పు అభ్యంతరకరంగా ఉన్నా.. జనంలోకి దూసుకుపోయింది. ఈ పాటపై రీల్స్ లెక్కలేనని వచ్చాయి. దీనిని బట్టి ఈ పాట పాపులారిటి అర్థం చేసుకోవచ్చు.
ఇక డేవిడ్ వార్నర్ ఎప్పుడైతే ఫ్రేమ్‌లోకి వచ్చాడో.. ఈ సినిమాకు ఇంకాస్త లీడ్ వచ్చింది. పైగా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కు డేవిడ్ వార్నర్‌ను తీసుకురావటం సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్ అయింది. కావాల్సిన అంత ప్రచారం జరిగింది. ఇక టీజర్, ట్రైలర్ కట్ లో దర్శకుడు తన తెలివితేటలని చూపించాలనుకోలేదు. జస్ట్ నవ్వించాడు. ఈరోజుల్లో ఏ సినిమా అయినా హిట్ అవ్వాలంటే.. జస్ట్ కామెడీ ఉంటే సరిపోతుంది. థియేటర్లకు జనాలు సరదాగా కాలక్షేపం చేయడానికి వెళ్తారు. నితిన్ ఈ సినిమా ప్రమోషన్లలో చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు. మొత్తానికి ఈసారి టీం మొత్తం ఓళ్లు దగ్గర పెట్టుకుని సినిమాని ముస్తాబు చేసింది. వరుస పరాజయాలతో ఉన్న నితిన్‌కు.. ఈ సినిమాతో ఉపశమనం దొరికితే పడిన కష్టానికి ప్రతిఫలం దొరికినట్టే.