బుట్ట బొమ్మగా టాలీవుడ్ లో చెరిగిపోని ముద్ర వేసుకున్న పూజ హెగ్డే తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్లు చేసింది. తన జీవితాన్ని నాశనం చేయడానికి కొంత మంది లక్షలు ఖర్చు పెడుతున్నారంటూ పూజ హెగ్డే మాట్లాడే మాటలు చాలామందికి ఆశ్చర్యంగా అనిపించాయి. మరి ఇంతకీ పూజ హెగ్డే జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది ఎవరు? ఆమె మీద రూమర్లు  క్రియేట్ చేయడానికి లక్షలు ఖర్చు పెడుతుంది ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరితో నటించి టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న పూజ హెగ్డే ఆ తర్వాత వరుస ఫ్లాప్ లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అదే సమయంలో బాలీవుడ్లో అవకాశాలు రావడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయి చివరికి సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు కరువయ్యేలా చేసుకుంది. ఇక ఆ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం వచ్చినప్పటికీ పవన్ సినిమాలను వాయిదా వేయడంతో ఆ సినిమా నుండి తప్పుకుంది.

దాంతో పవన్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఫిక్స్ అయింది.ఆ తర్వాత పూజ హెగ్డే కి బాలీవుడ్ లో వరుస ఫ్లాప్స్ ఎదురవ్వడంతో పాటు సౌత్ లో కూడా అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో తన కెరియర్ కి ఎండ్ కార్డ్ పడి పోతుందని ఆమె ఫ్యాన్స్ బాధపడ్డారు. అలాంటి సమయంలోనే తమిళంలో తెలుగులో రెండు సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. దాంతో మళ్ళీ పూజ హెగ్డే కం బ్యాక్ ఖచ్చితంగా ఇస్తుందని ఫ్యాన్స్ ఆశపడ్డారు. ఇదిలా ఉంటే తాజాగా  ఓ ఇంటర్వ్యూలో పూజ హెగ్డే మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగడానికి ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాను. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను.కానీ ఇప్పటికి కూడా కొంతమంది నాపై దుష్ప్రచారం ట్రోలింగ్ చేయడం కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు.

నా సినీ కెరియర్ నాశనం అవ్వడం కోసం వాళ్లు లక్షలు ఖర్చుపెట్టి నా మీద ట్రోల్స్ చేయిస్తూ ఉంటే ఆ ట్రోల్స్ అన్ని చూసి నా కుటుంబం బాధపడుతోంది. నేను ఇండస్ట్రీలో ఉన్న ఎవరిని కూడా బాధ పెట్టలేదు. ఎవరికి ఎలాంటి కీడు చేయలేదు. అలాంటప్పుడు ఎందుకు నాపై ఇలాంటి దుష్ప్రచారాలు అవాస్తవాలు ప్రచారం చేస్తూ నా కెరీర్ ని నన్ను ఇబ్బంది పెడుతున్నారో తెలియడం లేదు. నా మీద ట్రోలింగ్ కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారంటే వారికి నాపై ఎంత పగుందో అర్థం చేసుకోవచ్చు. అయితే చాలా రోజుల నుండి నా మీద వచ్చే ట్రోలింగ్ ని పట్టించుకోవడం ఆపేశాను. వాటిని పట్టించుకోవడం వేస్ట్ అని పూర్తిగా కెరియర్ పైనే దృష్టి పెట్టాను అంటూ పూజ హెగ్డే తనపై వచ్చే ట్రోల్స్ పై మొదటిసారి స్పందించింది

మరింత సమాచారం తెలుసుకోండి: