ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టించిన డైరెక్టర్ ఎవరయ్యా అంటే చాలామంది పూరి జగన్నాథ్ పేరు చెబుతారు.. ఈయన ఏ సినిమా చేసిన ఏదో ఒక కొత్త హీరో హీరోయిన్ ని తీసుకొచ్చి వారికి లైఫ్ ఇచ్చేవాడు. అలా పూరి జగన్నాథ్ చేతిలో ఎంతోమంది హీరోలు స్టార్లుగా మారారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రవితేజ. ఈయనను హీరోగా పూర్తిస్థాయిలో నిలబెట్టింది పూరి జగన్నాథ్ అని చెప్పవచ్చు. అప్పట్లో పూరి సినిమాలు వచ్చాయి అంటే యూత్ లో ఎంతో ఫాలోయింగ్ ఉండేది. ఆ తర్వాత కొన్నాళ్లకు పూరి కాస్త డల్ అయిపోయి ఈ మధ్య కాలంలో మళ్ళీ తన టాలెంట్ ఏంటో నిరూపించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే అలాంటి పూరీ జగన్నాథ్  పవన్ కళ్యాణ్ తో మొదట బద్రి తీశారు. ఈ సినిమా సమయంలో  పూరి జగన్నాథ్ చాలా బాధపడ్డారట. దానికి కారణం ఏంటో ఆ వివరాలు చూద్దాం. 

పవర్ స్టార్ పవన్ హీరోగా చేసినటువంటి బద్రి సినిమా అందరికీ తెలిసిందే. ఇందులో కథానాయికలుగా అమీషా పటేల్, రేణు దేశాయ్ లు నటించారు. 2000 వ సంవత్సరం  ఏప్రిల్ 20వ తేదీన వచ్చినటువంటి ఈ సినిమాని విజయలక్ష్మి ఆర్ట్స్ బ్యానర్ వారు నిర్మించారు. అప్పట్లో ఈ సినిమాకు రమణ గోగుల అందించిన సంగీతం మరో లెవల్ అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా ఎలాగైనా పవన్ కళ్యాణ్ తో తీయాలని పూరి జగన్నాథ్ పట్టుపట్టారు. ఇప్పటికే మంచి సక్సెస్ మీదున్న పవన్ కళ్యాణ్ ను కలవాలంటే పూరికి చాలా కష్టమైంది. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడుకు చెప్పి పవన్ కళ్యాణ్ ని ఎలాగైనా కలిసే అవకాశం కల్పించండి అన్నారట. వెంటనే ఆయన పవన్ కళ్యాణ్ ను కలిసి ఈ విషయం చెప్పి పూరి కి అపాయింట్మెంట్ వచ్చేలా చేశాడు.

అలా పవన్ కళ్యాణ్ కు బద్రి కథ చెప్పగానే ఆయన కి నచ్చి సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఇక సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు చాలా నెగిటివ్ టాక్ రావడంతో పూరి జగన్నాథ్ చాలా బాధపడిపోయారట. సినిమా ఇలా అయితే నా పరిస్థితి ఏంటి అంటూ ఆఫీసులో కూర్చొని ఉన్నారట. ఇదే సమయంలో సింగర్ రఘు కుంచే పూరి దగ్గరికి వెళ్లి సినిమా ఫ్లాప్ టాక్ వచ్చింది  అని చెప్పడంతో  పూరి భయపడి పోయి  నా పరిస్థితి ఏంటని ఆలోచించారట.. కానీ ఈ సినిమా రెండవ రోజు నుంచి కాస్త పాజిటివ్ టాక్ తో మూడో రోజు నుంచి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోయింది. అలా ఏకంగా 200 రోజులు ఆడి చరిత్ర సృష్టించింది. దీంతో పూరి పేరు ఎక్కడికో వెళ్లిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: