ఈ ఏడాది విడుదలైన సినిమాలలో గేమ్ ఛేంజర్ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా నిర్మాత దిల్ రాజుకు సైతం భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చిన సంగతి తెలిసిందే. అయితే గేమ్ ఛేంజర్ సినిమా గురించి దిల్ రాజు చాలా సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. 28 డిగ్రీ సెల్సియస్ ప్రమోషన్స్ లో భాగంగా నవీన్ చంద్ర ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.
 
గేమ్ ఛేంజర్ సినిమాలో ఛాన్స్ దక్కినందుకు నేను గర్వపడతానని నవీన్ చంద్ర తెలిపారు. నన్ను ఎలా ఎంపిక చేసినప్పటికీ ఆ సినిమాలో సెలెక్ట్ చేయడం విషయంలో నేను గర్వ పడతానని నవీన్ చంద్ర చెప్పుకొచ్చారు. గేమ్ ఛేంజర్ సినిమా నా కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోతుందని ఆయన కామెంట్లు చేశారు. గేమ్ ఛేంజర్ పెద్ద సినిమా అని పెద్ద బడ్జెట్ మూవీ అని నవీన్ చంద్ర అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
అందరు ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని గేమ్ ఛేంజర్ సినిమా తీశారని ఆయన తెలిపారు. నేను బళ్లారి నుంచి వచ్చానని అలాంటి పెద్ద సినిమాలో ఛాన్స్ దక్కినందుకు గర్వంగా ఉందని ఆయన తెలిపారు. రిజల్ట్ సంగతి పక్కన పెడితే ఆ సినిమా బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిందని నవీన్ చంద్ర వెల్లడించారు. నేను కొత్తవారితొ ఎక్కువ సినిమాలు చేస్తుంటానని అయితే నేను చేసిన మొదటి పెద్ద సినిమా నేను లోకల్ అని నవీన్ చంద్ర అన్నారు.
 
శంకర్ సార్ తో దిల్ రాజు ప్రొడక్షన్ లో వర్క్ చేయాలనే అదృష్టం నాకు ఉందని ఆయన తెలిపారు. అందువల్లే గేమ్ ఛేంజర్ సినిమాలో నాకు ఛాన్స్ దక్కిందని ఆయన చెప్పుకొచ్చారు. నవీన్ చంద్ర రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది. నవీన్ చంద్ర క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతున్నాయి. నవీన్ చంద్రను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: