కొంతమంది హీరోయిన్లు చేయిదాకా వచ్చిన అవకాశాలను కాలదన్నుకుంటూ ఉంటారు. అలా హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఓ డిజాస్టర్ సినిమా కోసం ఏకంగా 500 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాని రిజెక్ట్ చేసింది.మరి ఇంతకీ కీర్తి సురేష్ రిజెక్ట్ చేసిన ఆ సినిమా ఏంటి..ఎందుకు ఆ సినిమాని రిజెక్ట్ చేసింది అనేది ఇప్పుడు చూద్దాం.. మహానటి సినిమా తర్వాత నేషనల్ వైడ్ లో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్.. ఈ హీరోయిన్ మహానటి సినిమా తర్వాత వరుస సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్స్ అందుకుంది.అలా కీర్తి సురేష్ సినీ కెరియర్ లో మహానటి, దసరా, సర్కారు వారి పాట, నేను శైలజ, నేను లోకల్ వంటి ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. 

అయితే అలాంటి హీరోయిన్ రీసెంట్ గానే ప్రేమించిన ప్రియుడిని పెళ్లాడింది.ఇక పెళ్లయ్యాక కీర్తి సురేష్ నటించిన బాలీవుడ్ మూవీ బేబీ జాన్ విడుదలై అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమా తమిళ్ హీరో విజయ్ నటించిన తేరి మూవీకి రీమేక్..కానీ తెలుగు తమిళంలో హిట్ కొట్టిన ఈ సినిమా హిందీలో మాత్రం ఫ్లాప్ అయింది. అయితే అట్టర్ ఫ్లాప్ అయిన బేబీ జాన్ మూవీ కోసం ఏకంగా 500 కోట్లకి పైగా కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాని కీర్తి సురేష్ రిజెక్ట్ చేసిందట.

సినిమా ఏదో కాదు ఛావా.. విక్కీ కౌశల్ రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా మరాఠా యోధుడు శివాజీ మహారాజ్ కొడుకు శంబాజీ మహారాజ్ బయోపిక్ గా తెరకెక్కిన ఛావా మూవీలో శంభాజీ భార్య  యేసుభాయి పాత్రలో నటించే అవకాశం మొదట కీర్తి సురేష్ కే దక్కిందట. కానీ అప్పటికే బేబీ జాన్ మూవీకి ఒప్పుకోవడంతో ఛావా మూవీని రిజెక్ట్ చేసిందట.అలా డిజాస్టర్ మూవీ కోసం ఛావా వంటి బ్లాక్ బస్టర్ మూవీ ని కీర్తి సురేష్ రిజెక్ట్ చేసినట్టు బీటౌన్ లో రూమర్లు వినిపిస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: