
టాలీవుడ్ లో అతిపెద్ద నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్.. ఇప్పుడు రెండు వారాల గ్యాప్ లో 3 పెద్ద సినిమాలను థియేటర్లోకి తీసుకువస్తుంది .. ఈ నెల చివర లో దాదాపు రూ . 70 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన నితిన్ , శ్రీలీలా , వెంకి కుడుముల కాంబోలో రాబిన్ హుడ్ ను రిలీజ్ చేస్తున్నారు .. ఈ సినిమా నిర్మాణం విడుదల కాస్త ఆలస్యం అవుతూ వచ్చింది .. నిర్మాణం ఎక్కువగానే పెరిగి వడ్డీల భారం కూడా పెరిగింది .
దీనికి కారణంగా థియేటర్ మీద నుంచి దాదాపు 25 కోట్ల కు పైగా రికవరీ రావాల్సి ఉంది . అలా అనే ఏప్రిల్ మొదటి వారం లో రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు .. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన గుడ్ బాడ్ అగ్లీ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది .. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు . ఇదే టైం లో మైత్రి నిర్మించిన గోపీచంద్ మలినని , సన్నీ డియోల్ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది .. ఇది 150 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన సినిమా ..
ఈ రెండు సినిమాల మీద కలిపి థియేటర్ నుంచి దాదాపు 200 కోట్ల వరకు రావాల్సి ఉందని అంచనా . అంటే రెండు వారాల గ్యాప్ లో దాదాపు 250 కోట్లు దియేటర్ నుంచి మూడు సినిమాల ద్వారా మైత్రి సంస్థ రాబట్టు కోవాల్సి ఉంటుంది .. ఇది చాలా పెద్ద ఫైట్ .. తెలుగు సినిమాల సంగతి ఎలా ఉన్న హిట్ అనిపించుకుంటే తమిళ్ , హిందీ సినిమాల నుంచి డబ్బులు మామూలుగా రావు అంతకు అంత తిరిగి వస్తాయి .. అది తెలిసే వరకు మాత్రం టెన్షన్ టెన్షన్.