
ఇక ఈ లిస్టులో లేని బాలకృష్ణ , ప్రభాస్ లాంటి వారి పై కూడా కేసులు పెట్టాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు .. ఒకవైపు ఇదంతా నడుస్తుంటే ఎఫ్ఐఆర్ లో పేర్లు ఉన్నప్పటికీ ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు ఇద్దరు హీరోయిన్లు .. వారే నిధి అగర్వాల్ , ప్రణీత.. నటీనటులు జాబితాలో రానా , ప్రకాష్ రాజ్ , విజయ్ దేవరకొండ తో పాటు వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయి .. కానీ వీళ్ళు మాత్రం వీటి పై అసలు ఎక్కడ స్పందించడం లేదు .. వీళ్ల కు నోటీసులు ఇచ్చార లేదా అనే అంశంపై కూడా పోలీసు ఇంకా ఎక్కడ రియాక్ట్ కాలేదు . అయితే ముందుగా ప్రణీత విషయానికి వస్తే ఈమె గతంలో బెట్టింగ్ యాప్ కు ప్రచారం చేశారు .
కానీ దానికి సంబంధించిన పాత వీడియోలు ఫోటోలు ఇప్పుడు మరోసారి వైరల్‌గా మారాయి .. అయితే ఆమె మాత్రం వాటితో సంబంధం లేదు అన్నట్టుగా ఆమె ప్రవర్తన ఉంది .. కుటుంబంతో కలిసి ఫ్రాన్స్ వెళ్లిన ప్రణీత అక్కడ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తుంది .. ఇండియా తిరిగి వచ్చిన తర్వాత ఈ కేసు పై ఆమె స్పందిస్తుంది లేదో చూడాలి .. మరు పక్క నిధి అగర్వాల్ మాత్రం హైదరాబాద్లో ఉంది .. కానీ ఆమె ఇప్పటివరకు ఎక్కడ ఇష్యూ పై స్పందించలేదు .. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే ఎప్పుడైతే బెట్టింగ్ యాప్స్ వ్యవహారం తెరపైకి వచ్చిందో అప్పటినుంచి ఈ సోషల్ మీడియాలో ఎక్కడ యాక్టివ్ గా కనిపించడం లేదు .