
కానీ ఇప్పుడు మ్యాడ్ 2 ,రాబిన్ హూడ్ సినిమాలకు ఎందుకు పెంచారు అనేది మాత్రం ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా మారింది . అయితే ఇక్కడ బడ్జెట్ తో సంబంధం లేకుండా హైప్ ఆధారంగా టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు ఏమన్నా తీసుకొచ్చారేమో .. ఈ రెండు సినిమాల పై ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు ఉన్నాయి .. వాటిని క్యాష్ చేసుకొనేందుకు ఇలా టిక్కెట్ రేట్లు పెంచి ఉంటారని కూడా అంటున్నారు . అయితే పెంచింది 75 రూపాయలే కదా దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు అనే ప్రశ్న కూడా వస్తుంది ..
అయితే ఇక్కడ సమస్య 50 రూపాయలు పెంచారా లేక 75 రూపాయల పెంచారా అనేది కాదు అసలు ఎందుకు పెంచుతున్నారనేది ఇక్కడ అసలు విషయం .. మ్యాడ్ 2 చిన్న సినిమా అనే విషయం అందరికీ తెలుసు .. ఇక రాబిన్‌హూడ్ సినిమాకు కూడా నితిన్ మార్కెట్ కు తగ్గట్టే బడ్జెట్ను కేటాయించారు . కాకపోతే అనుకున్నంత స్థాయిలో భారీగా ఖర్చయింది .. ఇది భారీ బడ్జెట్ సినిమా కాదు భారీగా గ్రాఫిక్స్ కూడా లేదు .. అయినా కూడా ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లు పెంచేశారు .. ప్రభుత్వ పెద్దలతో మంచి సంబంధాలు ఉంటే చాలు సినిమా పెద్దదా చిన్నదా అనేది చూడకుండా రేట్లు పెంచుకోవచ్చని ఈ సినిమాలు నిరూపించాయి ..