
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒకప్పటి హీరోయిన్లు ఎంతో సాంప్రదాయంగా ఉండేవారు. ఎలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలు లేకుండా అచ్చ తెలుగు అమ్మాయిల ప్రేక్షకులను వారి అందంతో కట్టిపడేసేవారు. ఇక నేటి కాలంలో చాలా మంది హీరోయిన్లు వారి నటన కన్నా ఎక్కువగా ఎక్స్పోజింగ్ పాత్రలతోనే ఫేమస్ అవుతున్నారు. ఇక ఒకప్పటి నటి అన్షు అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఈ చిన్నదాని గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. అన్షు అంబానీ మన్మధుడు, రాఘవేంద్ర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువైంది. తన అమాయకమైన చూపు, సాంప్రదాయమైన లుక్ లో కనిపించి ఒకానొక సమయంలో కుర్రాళ్ళ మనసులను దోచుకుంది. ఈ చిన్నది ఈ సినిమాలలో నటిస్తున్న సమయంలో యూత్ లో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. నాగార్జున హీరోగా నటించిన మన్మధుడు సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది.
ఆ సినిమాలో ఈ చిన్నది కనిపించింది తక్కువ సమయమే అయినప్పటికీ ఈ చిన్నది తన నటన, అందంతో ప్రేక్షకులకు ఎంతగానో చేరువైంది. అన్షు నటించిన మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. మన్మధుడు సినిమా తర్వాత ఈ బ్యూటీకి తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఆ సినిమా అనంతరం రాఘవేంద్ర సినిమాలో నటించింది. ప్రభాస్ హీరోగా చేసిన ఈ సినిమాలో ఈ చిన్నది హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత మిస్సమ్మ సినిమాలో కేవలం గెస్ట్ రోల్ చేసింది. మళ్ళీ చాలా కాలం తర్వాత సందీప్ కిషన్ సినిమా మజాకా తో రీ ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో ఈ చిన్నదాని తలకి గాయమైనట్లుగా సమాచారం వచ్చింది. అయితే అప్పుడు ఆ కట్టు గురించి అన్షు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ మధ్యనే ఓ వీడియోని షేర్ చేస్తూ అన్షు అంబానీ తనకు ఏం జరిగిందో క్లారిటీగా చెప్పింది. అది పబ్లిసిటీ స్టంట్ కాదంటూ నిజంగానే తలకి గాయం అయిందని కుట్లు కూడా వేశారని అన్షు క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా తాను మళ్ళీ ఎప్పటిలానే తెలుగులో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ అభిమానులకు శుభవార్తను అందజేసింది. అన్షు చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.