బాలీవుడ్ లో గ‌తంలో స్టార్ హీరోయిన్లగా ఉన్న‌రు .. పెళ్లి తర్వాత ఫ్యామిలీ లైఫ్ లో హ్యాపీగా ఉంటున్నారు .. ఇప్పటికే దీపికా పదుకొనే ఓ బిడ్డకు జన్మనిచ్చింది .  కీయ‌ర అద్వానీ ప్రెగ్నెంట్ అయింది .  అతియ శెట్టి కూడా అమ్మగా మారింది .. ఇంకా కాస్త వెనక్కు వెళితే అలియాభట్ లాంటి చాలామంది హీరోయిన్లు అమ్మగా మారారు .. అయితే కత్రినా కైఫ్ విషయమేంటి ? కత్రినా కైఫ్ కూడా తల్ల‌యితే చూడాలనుకుంటున్నట్టు చాలామంది పోస్ట్లు పెట్టడం ఇప్పుడు కొంత విడ్డూరంగా మారింది ..

విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకుని చాలా సంవత్సరాలయింది , వెంటనే ఆ తీపి కబురు కూడా అందించాలంటూ కొంతమంది గట్టిగా డిమాండ్ చేస్తున్నారు . పెళ్లి పిల్లలు అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం .. ఇక మొన్నటి వరకు పెళ్లి చేసుకోలేదంటూ ఆమె పై పోస్ట్లు పెట్టారు ఇప్పుడు పిల్లల్ని కనడం లేదంటూ సోషల్ మీడియాలో ఈ రచ్చ‌ మొదలవడాని కి ప్రధాన కారణం సల్మాన్ ఖాన్ .. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ సికిందర్ సినిమా ప్రమోషన్ల భాగంగా మాట్లాడిన ఈ స్టార్ హీరో కత్రినా కైఫ్ తో మరోసారి నటిస్తారా అనే ప్రశ్నపై ఆయన స్పందిస్తూ ..


ఆమె పెళ్లి చేసుకొని ఫ్యామిలో లైఫ్ లో సెటిలైంది పిల్లలు పుడితే చూడాలని ఉందంటూ ఆయన కామెంట్ చేశాడు .. అక్కడి నుంచి కత్రినా కైఫ్ వైవాహిక జీవితం పై ఈ చర్చ మొదలైంది .. త్వరగా ప్రెగ్నెంట్ అవ్వాలని ఫ్యామిలీ లైఫ్ ను మరింత ముందుకు తీసుకువెళ్లాలంటూ ఆమెకి సోషల్ మీడియాలో ఉచిత సలహాలు ఇస్తున్నారు చాలామంది .. అయితే ప్రస్తుతం కత్రినా కైఫ్ వయసు 41 సంవత్సరాలు .. ఈమె కూడా సోషల్ మీడియా లో చెబుతున్న విధంగా త్వరలో నే ఆమె అభిమానుల కు గుడ్ న్యూస్ చెబుతుందా లేదో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: