ఈమధ్య ఎక్కువగా సీక్వెల్స్ బాగానే ఆకట్టుకుంటున్నాయి.. చాలామందికి మొదటి భాగం చూడకుండానే రెండో భాగం చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమా చూడకముందే చాలా మంది L2 ఎంపురాన్  చూడడానికి ఇష్టపడుతున్నారట. ముందుగా లూసిఫర్ సినిమా చూస్తే L2 అర్థమవుతుందని పలువురు ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. మరి లూసీ ఫర్ సినిమా స్టోరీ విషయం గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


అనగనగా ఒక రాజ్యం... ఆ రాజ్యానికి ఒక మహారాజు ఉండేవారు.. రాజుకి పిల్లలు కూడా ఉండేవారు.. అతని చుట్టూ ఒక పెద్ద సైన్యం ఆయనను పొగుడుతూ ఉండే మరొక సైన్యం.. మహారాజు చాలా మంచి వ్యక్తి కావడం వల్ల కొంతమంది దుర్మార్గులు తమ దురాలోచనతో రాజ్యంలోకి చోరబడతారు.. అయితే అలాంటి సమయంలోనే ఆ మహారాజు మరణించగ. మంచి వాళ్ళ లాగా ఉండే సైన్యములో కొంతమంది దుర్మార్గులతో చేతులు కలిపి.. రాజ్యాన్ని రాబందుల రాజ్యాంగ చేయాలని చూస్తూ ఉంటారు.. ప్రస్తుతం సమాజంలో ఉండే రాజకీయ కోణంతో తీసినటువంటి చిత్రమే లూసేఫర్..

కథ విషయానికి వస్తే:

ముఖ్యమంత్రి పీకే రామదాస్ (సచిన్ ఖేడ్కర్) మరణం తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ పరిస్థితి ఏంటి తదుపరి సీఎం ఎవరు?.. దీనిపైన ఐయూఎఫ్ పార్టీ తర్జనభజన అవుతున్న సమయంలో పీకే రామదాసు మరణ తర్వాత ఆ పార్టీ అధికారాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తుంది ఆయన అల్లుడు బిఎల్ నాయుడు (వివేక్ ఒబెరాయ్) ముందుకు వస్తారు.. ఈ పార్టీలోని కీలకమైన నేతగా ఉన్న మహేష్ వర్మ (సాయికుమార్) సపోర్ట్ చేస్తారు.. అలాగే తన కావలసిన అనుమతులను ఇస్తే ఖచ్చితంగా పార్టీకి ఫండ్ ఇస్తామంటూ బిఎల్ నాయుడు చెబుతారు.

అయితే ఆ సమయంలోనే పీకేఆర్ కు అత్యంత సన్నిహితుడుగా ప్రజాధరణ పొందిన నాయకుడిగా పేరుపొందిన స్టీఫెన్ గట్టుపల్లి (మోహన్ లాల్) బిఎల్ నాయుడు చేస్తున్న పనిని వ్యతిరేకిస్తారు.. మాదకద్రవ్యాలను రాష్ట్రంలోకి తీసుకురాకూడదని కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఆ సమయంలోనే స్టీఫెన్ ని అరెస్టు చేయించాక స్టీఫెన్ ఎలా బయటికి వస్తారు బిఎల్ నాయుడు తీసుకురావాల్సిన డ్రగ్స్ ను రాష్ట్రానికి రాకుండా ఆపుతోంది ఎవరు? పీకేఆర్ తర్వాత రాజకీయ నాయకుడిగా ఎవరిని ఎంచుకుంటారు అన్నది ప్రశ్న?.. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది కథ చిత్రం.


సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోతే ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు అనే ప్రశ్న మొదలవుతుంది ముఖ్యంగా ఇది వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన అంశం కావడంతో ఈ సినిమాకి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారట ఈ సినిమాలో చాలానే ట్విస్టులతో కూడిన కథ ఉన్నది. డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా ఆవిష్కరించారు.


కానీ పీకేఆర్ మరణం తర్వాత ఆ స్థానంలోకి స్టీఫెన్ వస్తాడని అందరూ అనుకుంటారు.. బిఎల్ నాయుడు, స్టీఫెన్ మధ్య నువ్వా నేనా అనే పోటీ కూడా కొనసాగుతుంది.. కానీ స్టీఫెన్ సీఎం పదవి అందుకుంటారు అనుకునే సమయానికి ఊహించని మలుపు తిరుగుతుంది. లూసిఫర్ చిత్రంలో అతిగా స్పందించడం గాని భారీ డైలాగులు చెప్పడం వంటివి కనిపించవు ఇందులో మోహన్ లాల్ కనిపించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ప్రతి పాత్ర కూడా సినిమాకి బాగా కనెక్ట్ అయ్యేలాగానే ఉన్నది. మోహన్లాల్ ఇందులో 40 నుంచి 45 నిమిషాలు మాత్రమే కనిపిస్తారు .ఆయన పాత్ర ఈ సినిమా మీద చాలా ప్రభావం చూపించిందని చెప్పవచ్చు.


మలయాళ సినీ ఇండస్ట్రీలోని అత్యధికంగా కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. 30 కోట్లతో తీయగా 125 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిందట. ఈ చిత్రాన్ని తెలుగులో చిరంజీవి గాడ్ ఫాదర్ పేరుతో తీసిన పర్వాలేదు అనిపించుకుంది. కానీ లూసీ ఫర్ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం వంటి భాషలలో అమెజాన్ ప్రైమ్ లో ఉన్నది. L2 ఎంపురాన్ సినిమా చూడాలి అంటే కచ్చితంగా లూసీఫర్ సినిమా చూడాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: