ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్లు పెళ్లి అవ్వడతోనే చాలా ఫాస్ట్ గా పిల్లల్నికంటూ పిల్లలు పుట్టిన ఏడాదిలోపే మళ్ళీ సినిమాల్లోకి వచ్చి సినిమాల్లో యాక్టివ్ అయిపోతున్నారు. అయితే తాజాగా ఈ రామ్ చరణ్ హీరోయిన్ కూడా పెళ్లయిన ఏడాదిలోపే మళ్ళీ ఓ పండంటి బాబుకు జన్మనిచ్చి ఇద్దరు పిల్లల తల్లైంది.అయితే పెళ్లైన ఏడాదికే ఇద్దరు పిల్లల తల్లి ఎలా అవుతుంది అని మీ అందరికి అనుమానం రావచ్చు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. రామ్ చరణ్ అల్లు అర్జున్ లు హీరోలుగా వచ్చిన ఎవడు మూవీ అందరూ చూసే ఉంటారు.ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర కొంత వరకే ఉంటుంది.అలా ఎవడు మూవీలో కాజల్ శృతిహాసన్లు హీరోయిన్ లుగా నటించారు.

ఇక ఇందులో మరో నటి అమీ జాక్సన్ కూడా హీరోయిన్ గా చేసింది. ఇక ఎవడు మూవీ హిట్ అవ్వడంతో అమీ జాక్సన్ కి టాలీవుడ్ లో మంచి గుర్తింపు లభించింది.ఇక ఎవడు మూవీ తో పాటు అమీ జాక్సన్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఐ సినిమాలో విక్రమ్ సరసన హీరోయిన్గా చేసింది. అలా సినిమాలతో పాటు ఎఫైర్ లతో కూడా హాట్ టాపిక్ గా ఉన్న అమీ జాక్సన్ పెళ్లి కాకుండానే జార్జ్ పనియోటౌతో డేటింగ్ చేసి ఆండ్రు అనే బాబుకు జన్మనిచ్చింది. అయితే అప్పటికి వీరి పెళ్లి కాలేదు ఇక పెళ్లి చేసుకుందాం అనే సమయంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి జార్జ్ తో అమీ జాక్సన్ విడిపోయింది.

 ఆ తర్వాత బాబుని చూసుకుంటూ ఇండస్ట్రీలో రాణించిన అమీ జాక్సన్ మళ్ళీ హాలీవుడ్ నటుడు అయినటువంటి ఎడ్ వెస్ట్ విక్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.అయితే వీరి ఎంగేజ్మెంట్ గత ఏడాది జనవరిలో జరిగింది. ఆ తర్వాత ఆగస్టులో వీరి వివాహం జరిగింది. అలాగే గత ఏడాది పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో బాబుకి జన్మనిచ్చింది. దాంతో ఇద్దరు కొడుకులతో తన జీవితం మరింత సాఫీగా సాగాలని అభిమానులు సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్నారు.ప్రస్తుతం అమీ జాక్సన్ కి రెండో బిడ్డ పుట్టారు అనే విషయం తెలియడంతో చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా అమీ జాక్సన్ కి కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: