
ప్రస్తుతం ఢీ షోలో యాంకర్ గా చేస్తున్న ఈమె ఒకవైపు టీవీ షోలు ,మరొకవైపు సినిమాలతో బాగానే సంపాదిస్తున్నది. తాజాగా తన డ్రీమ్ కారైన మెరిసిడేస్ బెంజ్ సి క్లాస్ కారుని సైతం కొనుగోలు చేయడమే కాకుండా తన కుటుంబ సభ్యులు ప్రియుడుతో కలిసి షో రూమ్ కు వచ్చి మరి ఈ కారు తీసుకున్నట్లు ఒక వీడియోని షేర్ చేసింది. ఇక తన బాయ్ ఫ్రెండ్ పవన్ సిద్దు, కుటుంబంతో కలిసి మరి సంబరాలు చేసుకున్నది సోనియా సింగ్.
అలాగే తాను ఎంతో ఇష్టపడి కొన్నటువంటి ఈ కారులో తన బాయ్ ఫ్రెండ్ సిద్దుతో ఫస్ట్ డ్రైవ్ కి వెళ్ళినట్లుగా తెలియజేసింది సోనియా.. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారుతూ ఉన్నాయి. ఈ వీడియో చూసిన అభిమానులు ఈమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే ఈ కారు ధర విషయానికి వస్తే సుమారుగా 60 నుంచి 80 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తుంది. ఇంత ఖరీదైన కారు సోనియా కొనుగోలు చేసిందంటే ఈమె రేంజ్ భారీగానే పెరిగిపోయింది అంటూ పలువురు అభిమానులు నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని చిత్రాలను నటించాలని అభిమానులైతే కోరుకుంటున్నారు.