ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమ లో ఇప్పటివరకు చాలామంది అగ్ర హీరోలు తమ నట వారసులని ఇండస్ట్రీకి పరిచయం చేసి వరుసగా విజయాలు సాధించే విధంగా ప్రణాళికలు రచించుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్నారు .. అలానే తండ్రి కొడుకులు సైతం వరుస‌ విజయాలు అందుకుంటూ ముందుకు వెళ్ళటం విశేషం .. అయితే బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ  హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ గత కొన్ని సంవత్సరాలు నుంచి వార్తలు వస్తున్నాయి .. కానీ అవి ఇప్పటికీ నిజం కాలేదు . అయితే ఇప్పుడు బాల‌య్య‌ కొడుకు మోక్షజ్ఞ కూడా ఈ సంవత్సరం మొదటి సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి . అయితే ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయాయి.


ఇప్పటివరకు ఆ సినిమా ఇంకా మొదలు కాలేదు .  మరి ఎప్పుడు మొదలవుతుంది అనే దానిమీద ఇంకా సరైన ఆన్సర్ అయితే రావడం లేదు .. అలాగే ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో పాటుగా మరికొన్ని సినిమాలు కూడా మొదలు పెడుతున్నాడు .. అయితే ఈ సినిమాని ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకువెళ్తాడు ఎప్పుడు సినిమాని పూర్తిచేసి రిలీజ్ చేస్తారని దానిపై కూడా క్లారిటీ రావడం లేదు . ఎందుకు ఈ సినిమా లేట్ అవుతుంది .. ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞని పరిచయం చేసే బాధ్యతను సీరియస్ గా తీసుకున్నాడా ? లేదంటే లైట్ తీసుకున్నాడా ? ఇక ఈ ప్రాజెక్ట్ అసలు మొదలవుతుందా లేదంటే ఆగిపోతుందా ? అనే దాని మీద కూడా సర్వత్ర ఆసక్తి నెలకొంది .. ఇప్పటికే నందమూరి అభిమానులు సైతం మోక్షజ్ఞ ఎంట్రీ కోసం 1000 కళ్ళ‌తో ఎదురుచూస్తున్నారు . ఎప్పటికప్పుడు బాలయ్య కూడా ఈ సంవత్సరం మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అంటూ దాదాపు 5 సంవత్సరాల నుంచి ఇలాగే చెబుతూ వస్తున్నాడు .. కానీ ఇప్పటివరకు ఈ నందమూరి హీరో ఎంట్రీ జరగలేదు ..


ఇక ఇప్పుడు ఈ సినిమా ఉంటుందా ఉండదా మోక్షజ్ఞ కి సినిమాల‌ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా కావాలనే బాలయ్య అతన్ని ఇండస్ట్రీకి తీసుకురావాలని చూస్తున్నాడా అనే ఇలా ఎన్నో విషయాల మీద అసలు క్లారిటీ అయితే రావడం లేదు .. అయితే ఈ  సంవత్సరంలో ఈ నందమూరి హీరో సినిమాను మొదలుపెట్టి కనీసం వచ్చే సంవత్సరం అయినా రిలీజ్ చేస్తారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సిందే . ఇప్పటికే టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోల వారసులంతా ఇండస్ట్రీలో అడుగుపెట్టి వరుస‌ విజయాలు అందుకుంటూ దూసుకుపోతుంటే బాలయ్య కొడుకు మాత్రం ఇంకా ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలనే దానికోసమే ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు .. నందమూరి అభిమానులు అతని రాక కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు .. మరి ఈ నందమూరి హీరో ఎప్పుడు వస్తాడు సినిమా ఎప్పుడు చేస్తాడు అనేది ఇండస్ట్రీలో ఇప్పుడు అంద‌రిలో   దాని మీదనే  ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: