
అయితే అలాంటి ఒక ఎథిక్స్ సినిమాకి సీక్వెల్ రావాలి అని కోరుకోవడం తప్పులేదు . కానీ గుండమ్మ కథ సినిమాకు సీక్వెల్ వస్తే గుండమ్మ కథ సినిమానే మించిపోయే రేంజ్ లో ఉంటుంది అనుకోవడం మాత్రం కచ్చితంగా తప్పే. కొన్ని కొన్ని సినిమాలకి ఫస్ట్ వర్షన్ బాగుంటుంది. సీక్వెల్ - రీమిక్ లాంటివి అస్సలు సెట్ కావు . అలాంటి సినిమానే ఈ గుండమ్మ కథ . స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు.. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ సినిమాలో నటించిన విధంగా మరి ఏ హీరో కూడా నటించలేరు అని చెప్పడంలో సందేహం లేదు.
అయితే ఈ జనరేషన్లో ఇప్పటి తరం హీరోలు ఎవరు ఈ రోల్స్ కి బాగా సూట్ అవుతారు అంటే మాత్రం చాలా మంది సీనియర్ ఎన్టీ రామారావు గారి ప్లేస్ లో జూనియర్ ఎన్టీఆర్ అని.. నాగేశ్వరరావు గారి ప్లేస్ లో నాగచైతన్య అంటూ చెప్పుకొస్తున్నారు. . అఫ్కోర్స్ ఈ రోల్స్ కి వాళ్లు బాగానే ఉంటారు . కానీ గుండమ్మ కథ లాంటి సినిమాకి రీమేక్ చేయాలి అంటే ఆ సత్తా ఉన్న డైరెక్టర్ ఈ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం లేరు. బహుశా ఫ్యూచర్ లోనైనా సరే గుండమ్మ కథ లాంటి బిగ్ సినిమాకు సీక్వెల్ వస్తుంది ఏమో వేచి చూడాల్సిందే . ప్రజెంట్ నాగచైతన్య పలు సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు. రీసెంట్ గా తండేల్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు నాగ చైతన్య..!