
టైసన్ నాయుడు ఈపాటికి థియేటర్లోకి వచ్చేయాలి కానీ దీన్ని ఇంకా పూర్తి చేయకుండా భైరవంని కంప్లీట్ చేశాడు .. ఇక ఇది రిలీజ్ కాకుండానే హైందవం సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు .. ఇది కూడా పూర్తిగా కంప్లీట్ చేయకుండా ఇంకా సినిమాలను సైన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు .. అయితే ఇప్పుడు నాని కూడా బెల్లంకొండ లానే ప్రవర్తిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది . ఆసలు మేటర్ లోకి వెళితే .. సరిపోద్దా శనివారం తర్వాత నాని శిబి చక్రవర్తి దర్శకత్వంలో ఒక సినిమా చేయాలి .. కానీ పలు కారణాలు చెప్పి ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు .. ఆ వెంటనే శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో సినిమాను చేస్తారని అంతా అనుకున్నారు ..
కానీ హిట్ 3 మొదలుపెట్టాడు నాచురల్ స్టార్ . ఇది కంప్లీట్ అయిందో లేదో ది పారడైజ్ గ్లింప్స్ రెడీ చేయించాడు .. హిట్ 3 ప్యాచ్ వర్క్ కూడా నాని కంప్లీట్ చేయాల్సి ఉంది . మరోపక్క ది పారడైస్ షూటింగ్ కూడా ఇప్పట్లో మొదలుపెట్టే ఆలోచనలో నాని లేడని తెలుస్తుంది .. ఈ ప్రాజెక్టులు ఇలా మధ్యలో ఉండగానే ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఓకే చేశాడట .. వచ్చే ఏడాది వరకు ఈ సినిమా మొదలయ్యే అవకాశం లేదు .. అయినా సరే ఈ గ్యాప్ లో మరో కొత్త దర్శకుడు కథకి ఓకే చెప్పాడట నాని ... అందుకే బెల్లంకొండ శ్రీనివాస్ తో పోలుస్తూ నానిని ఇండస్ట్రీలో కొంతమంది గట్టిగా విమర్శలు చేస్తున్నారు .