శేఖర్ కమ్ముల .. ఈయన పేరుపై ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా కనిపించదు .. వినిపించదు . అసలు ఇండస్ట్రీలో నెగిటివిటీ లేని డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే కచ్చితంగా చెప్పుకునే పేరు శేఖర్ కమ్ముల . శేఖర్ కమ్ముల అంత టాలెంటెడ్ అండ్ మంచి డైరెక్టర్ . శేఖర్ కమ్ముల సినిమాలు ఎంత పీస్ ఫుల్ గా ఉంటాయి అనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.  కాగా శేఖర్ కమ్ముల ఇప్పుడు ధనుష్ తో "కుబేర" అనే సినిమాను చేస్తున్నాడు . ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కూడా కీలకపాత్రలో నటిస్తున్నాడు .


సినిమా నాగార్జునకు ఇటు ధనుష్ కు మంచి హిట్ అందజేస్తుంది అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . అయితే ఈ సినిమా అయిపోయిన వెంటనే శేఖర్ కమ్ముల ఏ హీరో తో సినిమాను ఓకే చేశాడు..? ఏ హీరో తో సినిమాలు తెరకెక్కించబోతున్నాడు అనేది బిగ్ హాట్ టాపిక్ గా మారింది . కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న  న్యూస్ ప్రకారం హీరో నానితో శేఖర్ కమ్ముల ఒక సినిమాకి కమిట్ అయినట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవిని చూస్ చేసుకున్నారట.



 శేఖర్ కమ్ముల - సాయి పల్లవి  కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాలా.  వీళ్ల కాంబోలో వచ్చిన ఫిదా.. ఆ తర్వాత వచ్చిన లవ్ స్టోరీ రెండు కూడా బ్లాక్ బస్టర్ హిట్సే . కాగా పర్ఫెక్ట్ హీరోకి పర్ఫెక్ట్ డైరెక్టర్ దొరికితే ఆ కాంబో రచ్చ రంబోలానే.  అలాంటి కాంబోనే ఈ శేఖర్ కమ్ముల  - నానిది అంటూ జనాలు ఓ రేంజ్ లో ఈ సినిమా గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.  ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ త్వరలోనే రాబోతున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది . అంతేకాదు ఈ సినిమా కోసం ఫ్యాన్స్  కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి ఇండస్ట్రీలో మరో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు శేఖర్ కమ్ముల..!

మరింత సమాచారం తెలుసుకోండి: