క్రిష్ జాగర్లమూడి ఈ పేరుకు అంతగా పరిచయం అవసరం లేదు .. గమ్యం ,వేదం, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ , కంచె వంటి మంచి సినిమాలను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించారు .. ఫలితాలు ఎలా ఉన్నా కూడా క్రిష్ పై గౌరవం పెరగడానికి అవి ఎంతగానో కారణమయ్యాయి .. ఆ తర్వాత బాలకృష్ణ 100వ సినిమాగా గౌతమీపుత్ర శాతకర్ణి అనే చారిత్రాత్మక సినిమాను తెర్కక్కించారు .. ఇక ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ వంటివి చూస్తే ఇది రెండేళ్ల పాటు తీసిన సినిమా నేనా అని అంతా అనుకుంటారు కానీ ఈ సినిమాని కేవలం 80 రోజుల్లోనే పూర్తి చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు క్రిష్ .


ఇలాంటి సినిమాలని అనుకున్న బడ్జెట్లో తీసి అనుకున్న డేట్ కి రిలీజ్ చేయడం అనేది కూడా ఎంతో పెద్ద చాలెంజ్ .  ఇక దాన్ని కూడా క్రిష్ ఎంతో సమర్థవంతంగా నిర్వహించాడు .. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా కూడా ఎంతగానో రాణించింది .. ఈ సినిమాకు ముందు కంచే సినిమాని కూడా తక్కువ బడ్జెట్ లో తీసి రిలీజ్ చేశాడు క్రిష్ .. అందుకే ఎన్టీఆర్ బయోపిక్ తో రెండు డిజాస్టర్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి మరి హరిహర వీరమల్లు సినిమాను తెరకెక్కించే అవకాశం ఇచ్చాడు .. ఇక క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 27వ సినిమాగా ఈ మూవీ మొదలయ్యింది .


కానీ పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టడంతో క్రిష్‌ మధ్యలో  కొండపాలెం అనే సినిమాను తీశారు .. తర్వాత కూడా పవన్ దీనికి డేట్స్ ఇచ్చే పరిస్థితిలో లేకపోవడంతో క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు .. ఆ తర్వాతా ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు .. ఇక మే 9న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్‌ ప్రకటించారు .. అయితే ఇది ఎంతవరకు నిజమవుతుందో వారికే తెలియదు .. కానీ 60 శాతం డైరెక్ట్ చేసిన సినిమా కాబట్టి ఇది బాగా ఆడితే క్రిష్ కు కూడా కొంత ప్లేస్ అవుతుంది .. మరో ప‌క్క ఏప్రిల్ 17న క్రీష్‌ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ఘాటి కూడా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు .. అయితే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ ప‌నులు ఇంకా పూర్తి కాకపోవటం వల్ల ఇది కూడా రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు .. క్రీష్‌ దర్శకత్వంలో వస్తున్న రెండు సినిమాలు పరిస్థితి ఒకేలా ఉంది .. వీటిలో ఒక్కటైనా హిట్ అయితే ఆయనకు మళ్ళీ గత వైభవం వస్తుంది .. లేదంటే హీరోలు ఛాన్స్ ఇవ్వడం ఆయనకు కష్టం .

మరింత సమాచారం తెలుసుకోండి: