కొన్ని సంవత్సరాల క్రితం ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీగా మ్యాడ్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఆ మూవీ కి కొనసాగింపుగా మ్యాడ్ స్క్వేర్ అనే మూవీ ని నిర్మించారు. ఈ మూవీ ని మార్చి 28 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే మ్యాడ్ మూవీ మంచి విజయం సాధించి ఉండడంతో మ్యాడ్ స్క్వేర్ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే నితిన్ తాజాగా రాబిన్ హుడ్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మూవీ ని కూడా మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అవుతూ ఉండడంతో ఈ రెండు మూవీలలో ఏ సినిమాకు ఎక్కువ థియేటర్లను కేటాయిస్తారు అనే దానిపై ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొని ఉంది. ఇకపోతే రాబిన్ హుడ్ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించారు. ఇక ఈ మూవీ ని నైజాం ఏరియాలో మైత్రి సంస్థ వారు ఓన్ గా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే నైజాం ఏరియాలో ఈ మూవీ 125 స్క్రీన్ లలో మొదటి రోజు విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే మ్యాడ్ స్క్వేర్ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఈ మూవీ యొక్క నైజాం ఏరియా థియేటర్ హక్కులను దిల్ రాజు దక్కించుకున్నాడు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మొదటి రోజు 170 స్క్రీన్ లలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇలా నైజాం ఏరియాలో మొదటి రోజు రాబిన్ హుడ్ సినిమా కంటే మ్యాడ్ 2 మూవీ ఎక్కువ థియేటర్లలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: