
ఏపీలో మ్యాడ్ స్క్వేర్ సినిమాకు టికెట్ రేట్ల హైక్ ఉంటుంది కానీ మరీ అన్ని ఏరియాలలో టికెట్ రేట్ల పెంపు ఉండదని తెలుస్తోంది. మ్యాడ్2 సినిమాకు దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ కాగా ఈ సినిమాకు నైజాంలో ఏకంగా 170 స్క్రీన్లు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. రాబిన్ హుడ్ సినిమా నైజాంలో ఏకంగా 125 స్క్రీన్లలో విడుదల కానుందని మైత్రీ నిర్మాతలు డిస్ట్రిబ్యూట్ చేయనున్నారని భోగట్టా.
నితిన్ రేంజ్ కు తక్కువ థియేటర్లే దక్కాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. రాబిన్ హుడ్ సినిమాకు వెంకీ కుడుముల డైరెక్టర్ కాగా మ్యాడ్ స్క్వేర్ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ రెండు సినిమాలు ఒకింత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కాయి. ఈ సినిమాల కమర్షియల్ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.
రాబిన్ హుడ్ సినిమాలో ఆసక్తికర ట్విస్టులు ఉండనున్నాయని తెలుస్తోంది. రాబిన్ హుడ్ నిడివి 2 గంటల 36 నిమిషాలు కాగా మ్యాడ్ స్క్వేర్ నిడివి మాత్రం 2 గంటల కంటే కొంచెం ఎక్కువగా ఉంది. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి. ఈ సినిమాలు ఇతర రాష్ట్రాల్లో సైతం ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది. రాబిన్ హుడ్ మూవీ ఏకంగా 70 కోట్ల రూపాయల కలెక్షన్లతో తెరకెక్కింది.