సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడు లేని సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. అందుకు ప్రధాన కారణం సంక్రాంతి సమయంలో ఎక్కువ శాతం స్టార్ హీరోలో నటించిన సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. దానితో ప్రేక్షకులు కూడా ఆ సినిమాలను థియేటర్లకు వెళ్లి చూడాలి అని అనుకుంటూ ఉండటంతో సంక్రాంతి సమయంలో బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. ఇకపోతే గత కొన్ని సంవత్సరాలుగా సంక్రాంతి పండక్కు మన తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలు కూడా విడుదల అవుతూ వస్తున్నాయి.

ఇకపోతే 2023 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే అదే సంవత్సరం తమిళ నటుడు తలపతి విజయ్ హీరోగా రూపొందిన వారిసు అనే సినిమాను తెలుగులో వారసుడు అనే పేరుతో సంక్రాంతి బాలిలో నిలిపారు. ఆ సంవత్సరం చిరంజీవి హీరోగా రూపొందిన వాల్టేరు వీరయ్య సినిమా సంక్రాంతి విన్నారుగా నిలిచింది. వారసుడు సినిమా పర్వాలేదు అనే స్థాయి కలెక్షన్లను మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేయగలిగింది. ఇకపోతే చిరంజీవి మరికొన్ని రోజుల్లోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ మొదలు పెట్టబోతున్న విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి అన్ని ప్లాన్స్ చేస్తున్నారు. తమిళ నటుడు తలపతి విజయ్ ప్రస్తుతం జన నాయగాన్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. మరి వచ్చే సంవత్సరం చిరు , విజయ్ మరోసారి బాక్సా ఫీస్ దగ్గర తలపడనున్నారు. మరి ఈ సారి సంక్రాంతి విన్నర్ గా ఎవరు నిలుస్తారో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: